విచారణాఽఽధికారి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ABN , Publish Date - Jul 07 , 2024 | 11:28 PM
చీమకుర్తి మండలం పల్లామల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో జరిగిన అక్రమాలపై విచారణాధికారి అయిన బి.వి.ఎ్‌స.కృష్ణశాస్త్రి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. పల్లామల్లి సొసైటీ సీఈవో బి.వి.రమణయ్య ఫిర్యాదుపై అఽధికారులు స్పందించారు. విచారణ నిర్వహించి కృష్ణశాస్త్రిపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు. తాజాగా ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు సంఘం కూడా రంగంలోకి వచ్చింది. విచారణాధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
పల్లామల్లి సొసైటీ సీఈవోఫిర్యాదుపై స్పందించిన అధికారులు
విచారణ చేపట్టిన డీసీవో
కలెక్టర్, సహకార శాఖ కమిషనర్‌కు నివేదిక
సీఎం, ఉన్నతాధికారులకు సొసైటీల ఉద్యోగుల సంఘం ఫిర్యాదు
ఒంగోలు (విద్య), జూలై 7 : చీమకుర్తి మండలం పల్లామల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో జరిగిన అక్రమాలపై విచారణాధికారి అయిన బి.వి.ఎ్‌స.కృష్ణశాస్త్రి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. పల్లామల్లి సొసైటీ సీఈవో బి.వి.రమణయ్య ఫిర్యాదుపై అఽధికారులు స్పందించారు. విచారణ నిర్వహించి కృష్ణశాస్త్రిపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు. తాజాగా ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు సంఘం కూడా రంగంలోకి వచ్చింది. విచారణాధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
డీసీవో విచారణ
సొసైటీ సీఈవో రమణయ్య ఫిర్యాదు మేరకు డీసీవో శ్రీనివాసరెడ్డి పల్లామల్లి సొసైటీకి వెళ్లి విచారణ నిర్వహించారు. విచారణాఽఽధికారి దూషణలను భరించలేకపోతున్నానని, తనను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా సీఈవో కోరారు. సమగ్ర విచారణ అనంతరం డీసీవో తన నివేదికను కృష్ణశాస్త్రిపై తగు చర్యల నిమిత్తం కలెక్టర్‌కు అందజే శారు. ఈ మొత్తం వ్యవహారంపై మరో సమగ్ర నివేదికను రాష్ట్ర సహకారశాఖ కమిషనర్‌కు రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించినట్లు డీసీవో ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
విచారణాధికారిని మార్చాలి
పల్లామల్లి సొసైటీ సీఈవో రమణయ్యను వేధింపులకు గురిచేస్తూ దుర్భాషలాడుతున్న విచారణాధికారిని వెంటనే మార్చాలని ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచారణాధికారి బెదిరింపులకు దిగడం, జుగుప్సాకరంగా మాట్లాడటం వంటి చర్యలను వారు ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు వారు సీఎంతోపాటు సహకార శాఖ కమిషనర్, కలెక్టర్, డీసీవో, డీఎల్‌సీవోలకు ఫిర్యాదు చేశారు.
విచారణ విషయంలో నిర్లక్ష్యం.. సీఈవోపై అసభ్యపదజాలం
పల్లామల్లి సొసైటీలో భారీగా ఆర్థిక అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీనిపై సహకారశాఖ అసిస్టెంట్ రిజస్ట్రార్ బి.వి.ఎ్‌స.కృష్ణ శాస్త్రిని విచారణాధికారిగా నియమించారు. అయితే విచారణ విషయంలో ఆయన తీవ్ర అలసత్వం ప్రదర్శించారు. దీంతో డీసీవో శ్రీనివాసులురెడ్డి రెండుసార్లు హెచ్చరికలు జారీ చేశారు. తీరా విచారణకు ఆదేశించిన ఆరునెలల తర్వాత కేవలం 2022-23 సంవత్సరం రికార్డులు మాత్రమే పరిశీలనకు స్వాధీనం చేసుకున్నారు. ఈలోపు అసలు విచారణ జరగకుండా అడ్డుకొనేందుకుకు సొసైటీ సీఈవో ద్వారా విచారణాధికారి చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. దీంతో విచారణ తప్పని సరైంది. ఈ క్రమంలో కృష్ణశాస్త్రి సొసైటీ సీఈవో రమణయ్యను వ్యక్తిత్వహననం చేస్తూ అసభ్యపదజాలంతో అనరానిమాటలు అనడం ప్రారంభించారు. సహకార శాఖ ఉన్నతాధికారులను దూషించారు. విచారణ నిలిపివేసేందుకు విచారాణాధికారే హైకోర్టు లాయర్‌తో సంభాషించడం, సొసైటీ సీఈవో, ఉన్నతాధికారులను దూషించడం ఇవన్నీ రికార్డు అయి సహకార శాఖలో వైరల్‌గా మారాయి. ఈనేపథ్యంలో సీఈవో రమణయ్య డీసీవోను విచారణాధికారి దూషించిన ఆడియోలతో ఫిర్యాదు చేశారు.