Share News

మిర్చి రైతుకు తెగుళ్ల పోటు

ABN , Publish Date - Jan 11 , 2024 | 10:08 PM

మండలంలో రైతులు సాగు చేసిన మిర్చి తో టలకు తెగుళ్లు సోకి విలవిలలాడిపోతున్నారు. తెగుళ్ల నుంచి తోటలను కా పాడుకొనేందుకు రైతులు వివిధ రకాల మందులు పిచికారి చేసినా ఏ మాత్రం అదుపులోకి రాక పోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది మిర్చి పంటకు ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది రెట్టింపు సాగు చేశారు. దాదాపు రబీ, ఖరీ్‌ఫలో కలిపి 4,400 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు.

మిర్చి రైతుకు తెగుళ్ల పోటు

అదుపు చేసేందుకు పడరాని పాట్లు

దిగుబడి తగ్గుతుందని రైతుల ఆందోళన

మందులు కొట్టలేక వదిలేస్తున్న మిర్చి

ముండ్లమూరు, జనవరి 11 : మండలంలో రైతులు సాగు చేసిన మిర్చి తో టలకు తెగుళ్లు సోకి విలవిలలాడిపోతున్నారు. తెగుళ్ల నుంచి తోటలను కా పాడుకొనేందుకు రైతులు వివిధ రకాల మందులు పిచికారి చేసినా ఏ మాత్రం అదుపులోకి రాక పోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది మిర్చి పంటకు ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది రెట్టింపు సాగు చేశారు. దాదాపు రబీ, ఖరీ్‌ఫలో కలిపి 4,400 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. ఎక్కువగా తేజా రకం విత్తనాన్ని ఎంచుకొని సాగు చేసిన రైతులకు తెగుళ్లు కొంప ముంచాయి. ప్రధానంగా ఆకు ముడత, నల్లి, జెమినీ వైరె్‌స సోకాయి. తోటలు ఎదుగుదలకు వచ్చి పూత, పింద దశలో ఉ న్న తోటలతో పాటు మొదటి కోత దశలో సైతం విపరీతమైన తెగుళ్లు సో కాయి. ఆ తెగుళ్ల నుంచి మిర్చి సాగు రైతు బయట పడేందుకు వివిధ రకాల మందులు పిచికారి చేసినా కూడా అదుపులోకి రావడం లేదు. కొంత మంది రైతులు ఐతే ఎన్ని మందులు కొట్టినా తెగుళ్లు కంట్రోల్‌కి రాక పోవడం తో తో టలు వదిలి వేశారు. మరి కొంత మంది రైతులైతే పుట్టిన కాడి కల్లా అప్పులు తీసుకు వచ్చి పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి స రాసరి రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు పెట్టుబడులు పె ట్టారు. తీరా దిగుబడి చూసే సరికి తెగుళ్ల వల్ల గణనీయంగా తగ్గుమొఖం పడుతుందేమోనని భయాందోళన చెందుతున్నారు. పుట్టిన కాడి కల్లా అప్పులు తీసుకు వచ్చి పెట్టుబడులు పెట్టారు. దిగుబడులు చూస్తే మొదటి కోతకు వచ్చిన దిగుబడి చూసి ఆందోళన చెందుతున్నా రు. మండలంలో ప్రధానంగా ఉమా మహేశ్వర అగ్రహా రం, పూరిమెట్ల, నాయుడుపాలెం, తమ్మలూరు, పసుపుగల్లు, వేములబండ, జమ్మలమడక, శంకరాపురం, సుంకరవారిపాలెం, నూజెండ్లపల్లి, ముండ్లమూరు, పులిపాడు, వేంపాడు, పోలవరం గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు మిర్చి తోటలను సాగు చేశారు. గత వారం పది రోజుల నుంచి ముమ్మరంగా మిర్చి కోస్తున్నారు. ఎక్కువగా నల్ల నల్లి, బొబ్బర, జెమినీ వైరెస్‌ సోకిన తోటలు మా త్రం దిగుబడి పూర్తిగా పడిపోయింది. లేత తో టలు మాత్రం ఎక్కువ గా నల్లి తెగులు చుట్టి వే సింది. వ్యవసాయ శాఖ అధికారులు అ డపాదడపా తోటల ను సం దర్శించి రైతులకు సూ చనలు ఇస్తున్నా కూడా ఏ మాత్రం అ దుపులోకి రాలేదు. దీం తో ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతుల ప రిస్థితి కొంత ఇబ్బందికరంగా మారింది.

Updated Date - Jan 11 , 2024 | 10:08 PM