Share News

వాగులో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట

ABN , Publish Date - Jan 06 , 2024 | 10:40 PM

నీటి కష్టాలు రోజురోజుకు రైతులను వెంటాడుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు వరదలు, ఎల్లవలతో నీట మునిగిన పంట పొలాలు నేడు నీరులేక భీటలు వాలుతున్నాయి. ఈతరుణంలో సాగునీటి కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అసలే అరకొరగా ప్రవహిస్తున్న పర్చూరు వాగులో కొందరు నీటి ప్రవాహానికి అడ్డుగా కట్టలు వేయటంలో దిగువ రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరదలు ముంచెత్తటంతో సర్వంకోల్పోయామని, ప్రస్తుతం మొక్కలు నాటుకుందామన్నా నీరు అందుబాటులో లేని దుస్థితిలో ఉన్నామని రైతులు వాపోతున్నారు.

వాగులో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట
పర్చూరు - కారంచేడు మధ్య వాగులో నీరు ముందుకెళ్లకుండా వేసిన అడ్డుకట్ట

- దిగువ భూములకు నీరందని పరిస్థితి

- పట్టించుకోని డ్రైనేజీ అధికారులు

- రైతుల ఆగ్రహం

పర్చూరు, జనవరి 6: నీటి కష్టాలు రోజురోజుకు రైతులను వెంటాడుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు వరదలు, ఎల్లవలతో నీట మునిగిన పంట పొలాలు నేడు నీరులేక భీటలు వాలుతున్నాయి. ఈతరుణంలో సాగునీటి కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అసలే అరకొరగా ప్రవహిస్తున్న పర్చూరు వాగులో కొందరు నీటి ప్రవాహానికి అడ్డుగా కట్టలు వేయటంలో దిగువ రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరదలు ముంచెత్తటంతో సర్వంకోల్పోయామని, ప్రస్తుతం మొక్కలు నాటుకుందామన్నా నీరు అందుబాటులో లేని దుస్థితిలో ఉన్నామని రైతులు వాపోతున్నారు. పర్చూరు - కారంచేడు మధ్యలో నీరు దిగువకు వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో తాము పంటలను ఎలా సాగుచేసుకోవాలంటూ వాపోతున్నారు. వాగులో యథేచ్ఛగా కట్టఏర్పాటు చేసినా సంబంధిత డ్రైనేజీ అధికారులు పట్టించుకోకపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కారంచేడు - పర్చూరు వాగు సమీప భూముల్లో వేల ఎకరాల్లో నీరులేక భూములు సాగుకు నోచుకోలేదు. ప్రస్తుతం సాగుకోసం భూములను సిద్ధం చేసుకున్న తరుణంలో ఉన్న నీటికి సాగుకోసం వినియోగించుకుందామన్న రైతులకు ఆడిఆశగా మారింది. వాగు మధ్యలో కట్టఏర్పాటుతో నీరు ముందుకు కదలని దుస్థితి ఏర్పడింది. దీంతో వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్ధకంగా మారింది.

వాగులో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే దిగువ రైతుల పరిస్థితి ఏమిటంటూ కారంచేడు వైస్‌ ఎంపీపీ యార్లగడ్డ సుబ్బారావు ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క కొమ్మమూరు కాలవలో నీరులేక వరి పంటలు ఎండిపోతున్నాయి. కనీసం మెట్ట భూముల్లో సాగుచేసుకుందామన్నా ఇలా వాగులో ఉన్న అరకొర నీటిని అందకుండా అడ్డకట్ట వేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వాగులో అడ్డుకట్ట వేసిన అధికారులు కన్నెత్తి కూడా చూడక పోవటం దారుణమన్నారు. ఈ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోతానని వైస్‌ ఎంపీపీ స్పష్టంచేశారు.

Updated Date - Jan 06 , 2024 | 10:40 PM