అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కర్ర తరలింపుపై కేసు
ABN , Publish Date - Sep 04 , 2024 | 11:11 PM
జామాయిల్ కర్రతో అ క్ర మంగా తరలివెళుతున్న వాహనాన్ని సీఐ భీమానాయక్ తన సిబ్బందితో కలిసి మంగళవారంరాత్రి స్వాధీనం చేసుకున్నారు
పామూరు, సెప్టెంబరు 4 : జామాయిల్ కర్రతో అ క్ర మంగా తరలివెళుతున్న వాహనాన్ని సీఐ భీమానాయక్ తన సిబ్బందితో కలిసి మంగళవారంరాత్రి స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని గు మ్మళంపాడు గ్రామంలో అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన జామాయిల్ తోటలను గు ర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా నరికి వాహనం ద్వారా తరలిస్తున్నారని వీఆర్వో శివశంకర్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సీఐ భీమానాయక్ తన సిబ్బందితో వలపన్ని అక్రమంగా తరలివెళుతున్న సుమారు 12 టన్నుల జామాయిల్ లోడు వాహనాన్ని అదుపులో తీసుకొన్నారు. డ్రైవర్ దేవనబోయిన నాగరాజుపై కేసు నమోదు చేశారు.