దొనకొండ మండల వైసీపీకి భారీ షాక్
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:05 PM
దొనకొండ మండల వైసీపీ కన్వీనర్ కందుల నారపురెడ్డి, వైస్ ఎంపీపీ వడ్లమూడి వెంకటేశ్వర్లు ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయంలో ఆయన తనయుడు రాఘవరెడ్డి సమక్షంలో బుధవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
దొనకొండ, ఏఫ్రిల్ 3 : దొనకొండ మండల వైసీపీ కన్వీనర్ కందుల నారపురెడ్డి, వైస్ ఎంపీపీ వడ్లమూడి వెంకటేశ్వర్లు ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయంలో ఆయన తనయుడు రాఘవరెడ్డి సమక్షంలో బుధవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. యువనాయకుడు మాగుంట రాఘవరెడ్డి వారికి పార్టీ కండవాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వనించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజెపీ కూటమి అభ్యర్ధిని గెలిపించాని, చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు జరిగితే యువతకు ఉపాది, పేదవాడికి సంక్షేమం సాధ్యమని రాఘవరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి డాక్టర్ లక్ష్మీ మామ కడియాల రమేష్ పాల్గొన్నారు.