ఆంధ్రకేసరి వర్సిటీ టీంకు 8 మంది ఎంపిక
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:54 PM
ఆంధ్రకేసరి యూనివర్సిటీ బాల్‌బాడ్మింటన్ టీం ఎంపికకు కొత్తపేట రావి సుబ్బారాయుడు, జయలక్ష్మి ఇండోర్ స్టేడియంలో సోమవారం సెలక్షన్స్ జరిగాయి. అంతరకళాశాలల నుంచి హాజరైన 30 టీంల నుంచి 8 మందిని వర్సిటీ టీంకు ఎంపిక చేశారు. ఆ టీం ఈ నెల 25న చెన్నై ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో జరిగే పోటీలలో పాల్గొంటుందని నిర్వాహకులు తెలిపారు.
వేటపాలెం(చీరాల), అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి) : ఆంధ్రకేసరి యూనివర్సిటీ బాల్‌బాడ్మింటన్ టీం ఎంపికకు కొత్తపేట రావి సుబ్బారాయుడు, జయలక్ష్మి ఇండోర్ స్టేడియంలో సోమవారం సెలక్షన్స్ జరిగాయి. అంతరకళాశాలల నుంచి హాజరైన 30 టీంల నుంచి 8 మందిని వర్సిటీ టీంకు ఎంపిక చేశారు. ఆ టీం ఈ నెల 25న చెన్నై ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో జరిగే పోటీలలో పాల్గొంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బీబీహెచ్ విద్యా సంస్థల వైస్ ప్రెసిడెంట్ కె.ఏకాంబరేశ్వరబాబు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సీహెచ్ వాసుదేవరావు, యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ దేవి వరప్రసాద్, సెలక్షన్ కమిటీ మెంబరు సాయి సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, బీబీహెచ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి, క్రీడాకులు పాల్గొన్నారు.