టీడీపీలోకి వైసీపీ కౌన్సిలర్లు క్యూ
ABN , Publish Date - Sep 21 , 2024 | 11:39 PM
చీరాల మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి క్యూ కడుతున్నారు. గతంలో 12 మంది కౌన్సిలర్లు ఎమ్మె ల్యే కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరారు. తాజాగా శనివారం రాత్రి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 9, 10 వార్డుల కౌన్సిలర్లు మల్లిల లలితా రాజశేఖర్, గోలి స్వాతి ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరారు. కొండయ్య వారి మెడలో పార్టీ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించారు. మిగిలిన అం దరూ కూడా తమ వైపు వస్తున్నారని చెప్పారు. ఈ నేపపథ్యంలో కొద్ది రోజుల నుంచి ఓ న్యాయవాది వైసీపీ మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుతో మంతనాలు జరుపుతున్నారు.
ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో చేరికలు
గతంలో 12 మంది, తాజాగా మరో ఇద్దరు
చైర్మన్ జంజనంతో న్యాయవాది మంతనాలు
జంజనం సమీప బంధువుతో రియల్ వ్యాపారి చర్చలు
చీరాల, సెప్టెంబరు 21 : చీరాల మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి క్యూ కడుతున్నారు. గతంలో 12 మంది కౌన్సిలర్లు ఎమ్మె ల్యే కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరారు. తాజాగా శనివారం రాత్రి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 9, 10 వార్డుల కౌన్సిలర్లు మల్లిల లలితా రాజశేఖర్, గోలి స్వాతి ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరారు. కొండయ్య వారి మెడలో పార్టీ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించారు. మిగిలిన అం దరూ కూడా తమ వైపు వస్తున్నారని చెప్పారు. ఈ నేపపథ్యంలో కొద్ది రోజుల నుంచి ఓ న్యాయవాది వైసీపీ మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుతో మంతనాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే కొండయ్యతో కలసి ప్రయాణం చేయాలని, జంజనంతో పాటు ఆయన వర్గీయులు కలసి రావాలని ఆ మంతనాలు సారాంశంగా తెలిసింది. ఇదిలావుండగా జంజనం సమీప బంధువుతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఇదే అంశానికి సంబంధించి మంతనాలు జరిపినట్లు సమాచారం. దీంతో చీరాల రాజకీయ ముఖచిత్రం మారనుందనేందుకు తాజాగా మరో ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి చేరడంతో స్పష్టమవుతుంది.
మనసులో మాట జంజనంకు
చెప్పిన ఎమ్మెల్యే కొండయ్య
నియోజకవర్గ ఎమ్మెల్యే కొండయ్య, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మధ్య శుక్రవారం జరిగిన సంభాషణలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మున్సిపల్ పరిధిలో రూ.65.10లక్షల వ్యయంతో మున్సిపల్ పరిధిలోని డ్రైన్లలో సిల్ట్ తీసే 13 పనులకు సం బంధించిన ప్రారంభ పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే, చైర్మన్, పలువురు కౌన్సిలర్లు, అధికారులు హాజరయ్యారు.
ఆ సందర్భంగా ప్రారంభ కార్యక్రమ అనంతరం ఎమ్మెల్యే కొండయ్య ఇంకెందుకు మీరు కూడా పార్టీలోకి రండి బ్రదర్ ... కలిసి పనిచేద్దాం అని మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావును నవ్వుతూ అడిగి తన మనసులో మాట చెప్పారు. మా మనస్సు, అంతరాత్మ మీకు తెలుసు. గతంలో కలసి పనిచేసినవాళ్లమేగదా అని జంజనం నర్మగర్భంగా సమాధానం చెప్పారు. ఈ క్రమంలో శనివారం మరో ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీలో చేరడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
మున్సిపల్ పాలకవర్గంలో
మారిన బలాబలాలు
మున్సిపల్ పాలకవర్గం ముఖచిత్రం మారుతోంది. బలాబలాలు మారుతున్నాయి. మున్సిపాలిటీ పాలకవర్గం మొత్తం 33 మంది. కోఆప్షన్ సభ్యులు ముగ్గురు. తాజాగా వైసీపీ కౌన్సిల ర్లు ఇద్దరు టీడీపీలో చేరడంతో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు సంఖ్య చెరిసమానం అయింది. వైసీపీకి చెందిన ఇద్దరు వైస్ చైర్మన్లు, 11 మంది కౌన్సిలర్లు, చైర్మన్‌తో వారి సంఖ్య 14కు పడిపోయింది. గతంలో 12 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే కొండయ్య వైపు ఉండగా తాజాగా మరో ఇద్దరు చేరడంతో వారి సంఖ్య 14కు చేరింది. మిగిలిన ఐదుగురు కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గంగా ఉన్నారు.
మరికొందరు చేరే అవకాశం
వైసీపీ వర్గంగా ఉన్న కౌన్సిలర్లలో మరికొంత మంది టీడీపీలో చేరే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రోజుల వ్యవధిలోనే ఆ పరిణామా లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది. ఈ క్రమంలో వైసీపీ దుకాణం ఖాళీ అవుతుందా లేకుంటే నామ మాత్రంగా ఉం టుందా అనేది వేచిచూడాలి.