పీఏసీఎస్‌లకు అధికారిక పర్సన్ ఇన్‌చార్జిలు
ABN , Publish Date - Jun 29 , 2024 | 06:27 AM
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎ్‌స)లకు అధికారిక పర్సన్ ఇన్‌చార్జిలను నియమించాలని ప్రభుత్వం సహకారశాఖను ఆదేశించింది.
అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎ్‌స)లకు అధికారిక పర్సన్ ఇన్‌చార్జిలను నియమించాలని ప్రభుత్వం సహకారశాఖను ఆదేశించింది. అధికారిక పర్సన్ ఇన్ చార్జిలను నియమించే అధికారం జిల్లా సహకార శాఖ అధికారులకు అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
మత్స్యకార సమాఖ్య పర్సన్ ఇన్‌చార్జిగా కమిషనర్
ఏపీ మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య అధికారిక పర్సన్ ఇన్‌చార్జిగా మత్స్యశాఖ కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది. మత్స్యకార సమాఖ్యకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగే వరకు లేదా ఈ ఏడాది డిసెంబరు 2వరకు పర్సన్ ఇన్‌చార్జిగా కమిషనర్ వ్యవహరించనున్నారు.
ఆక్వా అథారిటీ వైస్ చైర్మన్ రాజీనామా ఆమోదం
ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ అథారిటీ కో వైస్ చైర్మన్ పదవికి వడ్డి రఘురామ్ రాజీనామా చేశారు. దానిని ఆమోదిస్తూ గెజిట్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.