Share News

AP CS: ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్

ABN , Publish Date - Jun 07 , 2024 | 09:53 AM

ఏపీలో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీకి చెందిన నేతలు ప్రభుత్వ పదవుల నుంచి తప్పుకుంటున్నారు. మరోవైపు అధికారుల మార్పులు కూడా జరుగుతున్నాయి.

AP CS: ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్
AP CS Nirab Kumar Prasad

అమరాతి: ఏపీలో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీకి చెందిన నేతలు ప్రభుత్వ పదవుల నుంచి తప్పుకుంటున్నారు. మరోవైపు అధికారుల మార్పులు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్ (Nirab Kumar Prasad) నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం (AP Govt) ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని (CS Jawahar Reddy) ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో జారీ చేశారు. నీరభ్ కుమార్ ప్రసాద్ ఇప్పటివరకు అటవీ, పర్యావరణ, సైన్స్ వంటి శాఖలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. కాగా ఈయన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.

ఇవి కూడా చదవండి

CS Javahar Reddy: అమ్మ.. జవహరా!

AP News: స్పీకర్ రేసులో ఉన్నది వీరే..?

For more AP News and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 11:09 AM