Share News

కోవూరులో ఉత్సాహంగా ఎడ్ల పరుగు పందెం పోటీలు

ABN , Publish Date - Jan 14 , 2024 | 10:07 PM

సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కోవూరులోని కొత్తూరు రోడ్డులో ఉత్సాహంగా ఎడ్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు, పందెం అభిమానులు పోటీల

కోవూరులో  ఉత్సాహంగా   ఎడ్ల పరుగు పందెం పోటీలు
14 కేవీఆర్‌4 : ప్రఽథమస్థానం సాధించిన ఎడ్ల విజేతకు బహుమతి ప్రదానం చేస్తున్న సీఐ శ్రీనివాసరావు తదితరులు

కోవూరు, జనవరి14 : సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కోవూరులోని కొత్తూరు రోడ్డులో ఉత్సాహంగా ఎడ్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు, పందెం అభిమానులు పోటీలను తిలకించారు. ఈ పోటీతో కోవూరు - యల్లాయపాళెం రోడ్డు జనంతో నిండిపోయింది. రోడ్డుకు ఇరువైపులా యువకులు, రైతులు ఆనందోత్సాహాలతో పరుగు పందేల్లో పాల్డొన్నారు. నిర్ణీత దూరాన్ని ఎడ్ల బండిని వేగంగా లాక్కువెళ్లే సమయాన్ని నిర్వాహకులు స్టాప్‌ వాచ్‌ సహాయంతో లెక్కకడతారు. తక్కువ సమయంలో నిర్ణీత ప్రదేశానికి వెళ్లివచ్చిన ఎడ్లను విజేతలుగా నిర్ణయిస్తారు.

విజేతగా కోవూరు ఎడ్లు

ఈ పోటీల్లో కోవూరుకి చెందిన మద్దెల కిరణ్‌కు చెందిన చెన్నకేశవ ఎడ్లు ప్రథమ స్థానాన్ని సాధించాయి. నారపరెడ్డి రాధాకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సోమశేఖరరెడ్డి విజేతకు రూ.15,116 నగదు, వెండి కప్పును బహూకరించారు. ద్వితీయ బహుమతిని ఇందుకూరుపేట మండల పరిధిలోని గంగపట్నంకి చెందిన నిఖల్‌ ( చాముండేశ్వరి) ఎడ్లు సాధించాయి. విజేతకు దండి వీరరాఘవయ్య జ్ఞాపకార్ధం ఆయన భార్య సుబ్బమ్మ రూ.13,116 అందించారు. పెద్ది ప్రభావతి జ్ఞాపకార్థం ఆమె కుమారుడు మారుతీ నాగార్జున వెండి కప్పును అందచేశారు. మూడవ బహుమతిని పాటూరుకి చెందిన ఆంజనేయ ఎడ్లు సాధించాయి.బహుమతిని కోవూరుకు చెందిన గాదిరాజు భాస్కర్‌రావు, జీవనకృష్ణలు అందించారు. నాల్గవ బహుమతిని బాపట్ల జిల్లా కంకట్లపాళెంకి చెందిన అభయాంజనేయస్వామి ఎడ్లు సాధించాయి.బహుమతిని కోవూరుకు చెందిన శిగినం ఆదిశేషయ్య జ్ఞాపకార్ధం ఆయన కుమారుడు ఆదినారాయణ అందించారు. వెండి కప్పును సాయం వరదయ్య జ్ఞాపకార్దం ఆయన కుమారుడు సాయికుమార్‌ అందించారు. ఐదో బహుమతిని కోవూరుకు చెందిన వీరాంజనేయస్వామి ఎడ్లు సాధించాయి.బహుమతిని కోవూరుకు చెందిన గడ్డం చినవెంగళరెడ్డి జ్ఞాపకార్ధం ఆయన కుమారుడు వేణు అందించారు. వెండి కప్పును కైలాసం పద్మావతమ్మ జ్ఞాపకార్ధ ఆమె భర్త గోపాలరెడ్డి అందించారు. కోవూరు ఎడ్ల బండ్ల సంఘం ఆధ్వర్యలో ఏర్పాటు చేసిన పోటీల్ని జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజన బాబురెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ శివుని నరసింహులురెడ్డి, పడుగుపాడు సొసైటీ ఛైర్మన్‌ రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఐ శ్రీనివాసరావు , ఎస్‌ఐ రంగనాఽథ్‌ గౌడ్‌ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ పోటీలకు సమన్వయకర్తలుగా పొబ్బారెడ్డి మల్లికార్జునరెడ్డి, నరేంద్రరెడ్డి, తాటిపర్తి విజయకుమార్‌, రమణారెడ్డి,దేవిరెడ్డి సురేష్‌రెడ్డి, బాబు తదితరులు వ్యవహరించారు.

----------

Updated Date - Jan 14 , 2024 | 10:07 PM