Share News

అదుపుతప్పి మోటారు సైక్లిస్టుకు తీవ్రగాయాలు

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:16 PM

: మోటారుబైకుపై వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని చుండి గ్రామ సమీపంలో సోమవారం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా పామూరు మండలం బూదవాడ

అదుపుతప్పి మోటారు సైక్లిస్టుకు తీవ్రగాయాలు
1వివిపి1 తీవ్రంగా గాయపడిన హరికృష్ణ

పరిస్థితి విషమం

వలేటివారిపాలెం, జననవరి 1: మోటారుబైకుపై వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని చుండి గ్రామ సమీపంలో సోమవారం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా పామూరు మండలం బూదవాడకి చెందిన పోతినేని హరికృష్ణ తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు, హరికృష్ణ బూదవాడ నుంచి వలేటివారిపాలెం వైపు వేగంగా వెళ్తూ మోటారుబైకు అదుపుతప్పి చుండి సమీపంలో బోల్తా పడింది. ఆ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. హరికృష్ణను 108లో కందుకూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేర్చారు. ఎస్‌ఐ బాలమహేంద్రనాయక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 01 , 2024 | 11:16 PM