Share News

లారీ డ్రైవర్‌కి తీవ్రగాయాలు

ABN , Publish Date - Jan 14 , 2024 | 10:10 PM

బోగోలు మండలం ముంగమూరు క్రాస్‌రోడ్డు వద్ద ట్రాలీలారీ, బొగ్గులారీ ఆదివారం సాయంత్రం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొగ్గులారీ డ్రైవర్‌కి గాయాలయ్యాయి. హెడ్‌కానిస్టేబుల్‌ విజయ్‌ప్రసాద్‌ కథనం మేరకు, కృష్ణపట్నం

  లారీ డ్రైవర్‌కి తీవ్రగాయాలు
4బిటిటిఆర్‌14 : ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌

బిట్రగుంట, జనవరి 14: బోగోలు మండలం ముంగమూరు క్రాస్‌రోడ్డు వద్ద ట్రాలీలారీ, బొగ్గులారీ ఆదివారం సాయంత్రం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొగ్గులారీ డ్రైవర్‌కి గాయాలయ్యాయి. హెడ్‌కానిస్టేబుల్‌ విజయ్‌ప్రసాద్‌ కథనం మేరకు, కృష్ణపట్నం పోర్టు నుంచి తెలంగాణకు బొగ్గులోడుతో లారీ వెళుతోంది. కావలి వైపు వెళుతున్న ట్రాలీ లారీ సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుక వస్తున్న బొగ్గులారీ ఢీకొంది. దీంతో డ్రైవర్‌కు రెండు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన లారీ డ్రైవర్‌ గడ్డం అనంతరావును 108లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు ట్రాలీ లారీడ్రైవరును అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

----------

Updated Date - Jan 14 , 2024 | 10:10 PM