Share News

ఎరువుల దుకాణాల తనిఖీ

ABN , Publish Date - Jan 03 , 2024 | 10:11 PM

మండలంలోని పలు ఎరువుల దుకాణాలను బుధవారం వ్యవసాయాధికారి లలిత ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు అవసరమైన యూరియాతోపాటు అన్ని రకాల ఎరువులను అం

ఎరువుల దుకాణాల తనిఖీ
3అల్లూరు6 : అల్లూరు : ఎరువుల దుకాణంలో రికార్డులు పరిశీలిస్తున్న వ్యవసాయాధికారి లలిత

అల్లూరు, జనవరి 3 : మండలంలోని పలు ఎరువుల దుకాణాలను బుధవారం వ్యవసాయాధికారి లలిత ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు అవసరమైన యూరియాతోపాటు అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రైవేటు డీలర్ల వద్ద కూడా యూరియా రైతులకు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేటు డీలర్లు యూరియా కృత్రిమ కొరత సృష్టించినా, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కందుకూరు : పట్టణంలోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయాధికారి వీ. రాము బుధవారం తనిఖీ చేశారు. రైతుల వద్ద అధిక ధరలు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలో డీఏపీ 36.4 మెట్రిక్‌ టన్నులు, యూరియా 76.2 టన్నులు, సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ 100.25 మెట్రిక్‌ టన్నులు, అమ్మోనియం సల్ఫేట్‌ 86.85 టన్నులు, అన్నిరకాల కాంప్లెక్స్‌ ఎరువులు 342.55 టన్నులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

ఉలవపాడు : ఎరువులు, పురుగు మందులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారిణి బీ తిరుమల జ్యోతి హెచ్చరించారు. బుధవారం మండలంలోని పలు ఫర్టిలైజర్స్‌ దుకాణాలను తనిఖీ చేశారు. మండలంలోని ఆర్బీకేలకు 40 టన్నుల, ప్రవేటు డీలర్స్‌ వద్ద 125 టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు ఆమె చెప్పారు.

Updated Date - Jan 03 , 2024 | 10:11 PM