Share News

రూ.60 అప్పు తీర్చలేదని దాడి

ABN , Publish Date - Jan 11 , 2024 | 10:32 PM

పట్టణంలోని రెండవ డివిజన్‌లో పారిశుధ్య కార్మికురాలిగా దినసరి వేతనంపై పనిచేస్తున్న దావులూరి రమాదేవిపై గురువారం కిరాణా దుకాణం యజమానులు దాడి చేసి గాయపరిచారు. సమ్మె విరమణ అనంతరం రమాదేవి పుల్లారెడ్డినగర్‌లో వి

రూ.60 అప్పు తీర్చలేదని దాడి
11కెవిఎల్‌1: గాయపడిన మున్సిపల్‌ కార్మికురాలిని పరామర్శిస్తున్న యూనియన్‌ నాయకులు

కావలి, జనవరి11: పట్టణంలోని రెండవ డివిజన్‌లో పారిశుధ్య కార్మికురాలిగా దినసరి వేతనంపై పనిచేస్తున్న దావులూరి రమాదేవిపై గురువారం కిరాణా దుకాణం యజమానులు దాడి చేసి గాయపరిచారు. సమ్మె విరమణ అనంతరం రమాదేవి పుల్లారెడ్డినగర్‌లో విధులు నిర్వహిస్తుండగా బాకీ చెల్లించలేదని వారు దాడి చేశారు. గాయపడిన ఆమె కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతుండగా, సీపీఐ, మున్సిపల్‌ కార్మిక యూనియన్‌ నాయకులు పరామర్శించారు. వారు మాట్లాడుతూ రూ.60 అప్పు తీర్చలేదని దాడి చేసి గాయపరచటం దారుణమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నేత కొప్పర్తి నాగరాజు, ఏఐటీయూసీ నేత రవి, మున్సిపల్‌ యూనియన్‌ నేతలు మల్లె అంకయ్య, ఆదినారాయణ, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

----------

Updated Date - Jan 11 , 2024 | 10:32 PM