Share News

అంగన్‌వాడీలపై నిర్బంధాలా ?

ABN , Publish Date - Jan 11 , 2024 | 10:39 PM

: వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు తిరగబడుతున్నారని సీపీఎం మండల కార్యదర్శి తుమ్మల వెంకయ్య, టీడీపీ మండల కన్వీనర్‌ మాలేపాటి నాగేశ్వరావు అన్నారు. బోగోలు అరుంధతీవాడలోని సచివాలయం ఎదుట అంగన్‌వాడీలు చేపట్టిన నిరసనకే సీపీఎం, టీడీపీ,సీఐటీయూ, జైభీం అంబేడ్కర్‌ సేవాదళ్‌లు గురువారం మ

అంగన్‌వాడీలపై నిర్బంధాలా ?
3బిటిటిఆర్‌11 : బిట్రగుంట : అంగన్‌వాడీల నిరసనకు సంఘీభావం తెలుపుతున్న టీడీపీ, సీపీఎం, సీఐటీయూ నేతలు

బిట్రగుంట : వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు తిరగబడుతున్నారని సీపీఎం మండల కార్యదర్శి తుమ్మల వెంకయ్య, టీడీపీ మండల కన్వీనర్‌ మాలేపాటి నాగేశ్వరావు అన్నారు. బోగోలు అరుంధతీవాడలోని సచివాలయం ఎదుట అంగన్‌వాడీలు చేపట్టిన నిరసనకే సీపీఎం, టీడీపీ,సీఐటీయూ, జైభీం అంబేడ్కర్‌ సేవాదళ్‌లు గురువారం మద్దతు పలికాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్‌వాడీల న్యాయమైన కోరికలను తీర్చకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చల్లా నరహరి, లక్కాకుల మాధవరావు, బత్తుల రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీలపై నిర్బంధాలా ?

కావలి : పలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్‌ రెడ్డి వాటిని అమలు చేయాలని అంగన్‌వాడీలు పోరాటాలు చేస్తుంటే, వారిపై నిర్బంధాలు ఏమిటని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. స్థానిక సీపీఎం కార్యాలయంలో గురువారం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య అధ్యక్షతన ప్రతిపక్ష నేతలు సమావేశమై అంగన్‌వాడీల పోరాటానికి తమ సంపూర్ణమద్దుతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీలు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నెల రోజులుగా పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. అంగన్‌వాడీలకు మద్దతుగా ఈనెల 13న కావలిలో ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో బలిజేపల్లి వెంకటేశ్వర్లు(సీపీఐ) చింతాల వెంకట్రావు(కాంగ్రెస్‌) జ్యోతిబాబూరావు(టీడీపీ) కరువది భాస్కర్‌(సీపీఐ ఎంఎల్‌, న్యూడెమోక్రసీ) పీ. సాయి విఠల్‌(జనసేన) పీ. మహేష్‌ (ఎఫ్‌బీఐ) సీఐటీయూ నాయకులు టీ. మాల్యాద్రి, కృష్ణమోహన్‌, దర్గా బాబు, ఏఐటీయూసీ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 10:39 PM