Nara Lokesh - Taraka Ratna: తారకరత్న మరణంపై నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్
ABN , Publish Date - Feb 18 , 2024 | 03:25 PM
సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ (TDP) నేత నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) చనిపోయి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనను మననం చేసుకుంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. తారకరత్న చనిపోయి ఏడాది గడిచిపోయిందంటే నమ్మలేకపోతున్నానని లోకేశ్ విచారం వ్యక్తం చేశారు.
సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ (TDP) నేత నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) చనిపోయి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనను మననం చేసుకుంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. తారకరత్న చనిపోయి ఏడాది గడిచిపోయిందంటే నమ్మలేకపోతున్నానని లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ‘‘తారకరత్న మనల్ని వదిలివెళ్లి ఏడాది పూర్తయ్యిందంటే నమ్మలేకపోతున్నాను. మధురమైన నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాలో సజీవంగానే ఉంటాయి. కానీ నిన్ను మిస్ అవుతున్నాను మై డియర్ బ్రదర్..’’ అని అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. తారకరత్న ఫొటోని ఆయన షేర్ చేశారు.
కాగా గతేడాది శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో కన్నుమూశారు. గతేడాది జనవరి 27న కుప్పంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జనం మధ్యలోనే కుప్పకూలారు. వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి గ్రీన్ చానల్ ద్వారా ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు 45 నిమిషాలు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. సంబంధిత నిపుణులు చికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రముఖ న్యూరాలజిస్ట్, విదేశీ వైద్యుల సలహాలు తీసుకుని చికిత్స కొనసాగించారు. అయినప్పటికీ ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.