Share News

AP News: ఎన్టీఆర్ జిల్లాలో కుప్పకూలిన మోరి వంతెన.. గ్రామాలకు రాకపోకలు బంద్

ABN , Publish Date - Jan 01 , 2024 | 02:34 PM

Andhrapradesh: జిల్లాలోని గంపలగూడెం మండల పెనుగొలను గ్రామంలో మెట్టగుట్ట రోడ్డులో ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిపై మోరి వంతెన కుప్పకూలింది. దీతో ఆంధ్ర, తెలంగాణలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

AP News: ఎన్టీఆర్ జిల్లాలో కుప్పకూలిన మోరి వంతెన.. గ్రామాలకు రాకపోకలు బంద్

ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని గంపలగూడెం మండల పెనుగొలను గ్రామంలో మెట్టగుట్ట రోడ్డులో ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిపై మోరి వంతెన కుప్పకూలింది. దీతో ఆంధ్ర, తెలంగాణలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాలినడకన కూడా వెళ్లేందుకు వీలు లేకపోవడంతో గ్రామస్తులు అవస్థులు పడుతున్నారు. నిత్యం వాహనాలు అధిక లోడుతో ఈ రోడ్డు ద్వారా ప్రయాణం చేస్తుంటాయి.

ఈ రహదారిపై ఓవర్ లోడ్‌తో తెలంగాణకు ఇసుక టిప్పర్‌లు తిరగడం వలన రహదారి ధ్వంసమైంది. చెరువు మోరి వంతెన అద్వాన స్థితిలో ఉన్నా అధికారులు దీనిపై దృష్టిసారించక పోవడంతో అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీల రాకపోకలు వల్ల మోరి కూలిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే రహదారికి మరమ్మతులు చేసి ప్రయాణం సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 01 , 2024 | 03:19 PM