YCP: ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులను టార్గెట్ చేసిన వైసీపీ
ABN , Publish Date - Jan 12 , 2024 | 09:22 AM
కదిరిలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులను వైసీపీ టార్గెట్ చేసింది. ఇన్‌చార్జ్ మక్బుల్‌కు సహకరించని ఎమ్మెల్యే వర్గీయుల క్వారీల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ రెడ్డి, వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు జరుపుతున్నారు

అనంతపురం: కదిరిలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులను వైసీపీ టార్గెట్ చేసింది. ఇన్‌చార్జ్ మక్బుల్‌కు సహకరించని ఎమ్మెల్యే వర్గీయుల క్వారీల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ రెడ్డి, వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు జరుపుతున్నారు. అలాగే మరో నేత వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి విద్యాసంస్థల్లోనూ విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ ప్లాన్డ్‌గా పార్టీ మారేందుకు సిద్ధమైన కదిరి వైసీపీ అసమ్మతి నాయకులను టార్గెట్ చేస్తోందని జనం చర్చించుకుంటున్నారు.