Share News

వైసీపీకి గుణపాఠం చెప్పాలి

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:59 AM

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత అన్నారు.

వైసీపీకి గుణపాఠం చెప్పాలి

పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత

కల్లూరు, మార్చి 25: సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత అన్నారు. సోమవారం కల్లూరు అర్బన్‌ 20వ వార్డు శ్రీనగర్‌కాలనీలో శంఖారావం సూపర్‌సిక్స్‌ పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని గౌరు చరిత కరపత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ అధికార వైసీపీ పని అయిపో యిందని, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగవుతుందని అన్నారు. కార్యక్రమంలో పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌యాదవ్‌, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, పల్లె రఘునాథ్‌రెడ్డి, మాండ్రసీమ ప్రసాద్‌రెడ్డి, పెరుగు ధుర్గాప్రసాద్‌రెడ్డి, వంగాల జనార్ధన్‌రెడ్డి, శ్రీరాములు అయ్యస్వామి, తదితరులు పాల్గొన్నారు.

ఫ యువతకు ఉద్యోగ భద్రత టీడీపీతోనే సాధ్యం: తెలుగుదేశం ప్రభుత్వంలోనే రాష్ట్రంలో యువతకు ఉద్యోగ భద్రత ఉంటుందని పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత తనయుడు గౌరు జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం 29వ వార్డు బాలజీనగర్‌, విజ్జీనగర్‌, రుక్మీణీనగర్‌లో ప్రజల సమస్యలను తెలుసుకుని శంఖారావం సూపర్‌సిక్స్‌ పథకాల కరపత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈసందర్భంగా గౌరు జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాల కల్పించగల సమర్థత ఉన్న నాయకుడు చంద్రబాబే అన్నారు. వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ర్టాలకు పారిపోతు న్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేయ లేయలేని జగన్‌ పేదలపై చార్జీలు, పన్నుల భారాన్ని వేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం, రెవెన్యూలోటు, ప్రత్యేక రైల్వే జోన్‌, ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు, జాబ్‌క్యాలెండర్‌, మధ్య నియంత్రణ గాలికొదిలేసి, రాష్ట్రంలో మైన్‌, వైన్‌, ల్యాండ్‌, శాండ్‌, భూ ఆక్రమణలతో వైసీపీ నాయకులు చెలరేగి పోతున్నా రని ఆరోపించారు. కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జి కె.శ్రీనివాసరావు, వీరేంద్ర, రామకృష్న, పుల్లయ్యగౌడ్‌, జనసేన నాయకుడు షబ్బీర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:59 AM