Share News

సైనికుల్లా పనిచేయాలి

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:29 AM

టీడీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.

సైనికుల్లా పనిచేయాలి
వెలుగోడు: టీడీపీలో చేరిన యువతతో బుడ్డా

వెలుగోడు, ఏప్రిల్‌ 17: టీడీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. శిల్పా ముఖ్య అనుచరుడు వేల్పుల రవితో పాటు 30 కుటుంబాలు బుధవారం వేల్పనూరులోని బుడ్డా స్వగృహంలో టీడీపీలో చేరాయి. మాజీ సర్పంచ్‌ అబ్దుల్‌ కలాం, అమీర్‌ అలీఖాన్‌, బుడ్డన్న, లాయర్‌ రవి ఆధ్వర్యంలో బుడ్డా సమక్షంలో టీడీపీల చేరారు. అలాగే వెలుగోడులోని లక్ష్మీనగర్‌కు చెందిన అల్లురెడ్డి, కాశి రెడ్డి, చెంచి రెడ్డి, వేణు రెడ్డి, లోకేష్‌.. శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేల్పనూరులో టీడీపీలో చేరారు. అలాగే గట్టు తండాకు చెందిన చంద్రునాయక్‌ ,శివనాయక్‌తో పాటు మరో ఐదు కుటుంబాలు మాండ్ర శంకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేల్పనూరులో బుడ్డా సమక్షంలో టీడీపీలో చేరారు. గుంత కందాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గాండ్ల శివన్న, శ్రీనివాసులు, పెద్ద తిరుపాలు ఆధ్వర్యంలో దేవదాసు, పుల్లయ్యతో పాటు మరో 10 కుటంబాలు వేల్పనూరులో టీడీపీ చేరారు. వెలుగోడు పట్టణంలో రఫి, సమీర్‌, మరో 20 కుటంబాలు టీడీపీలో చేరాయి. అనంతరం బుడ్డా మాట్లాడుతూ గురువారం నామినేషన్‌ కార్యక్రమానికి తరలి రావాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఆత్మకూరు: వైసీపీ పాలనలో ముస్లిం మైనారీలకు ఎంతో ద్రోహం చేశారని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి మండి పడ్డారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో మూడో వార్డు కౌన్సిలర్‌ యూనస్‌తో సహా సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి. బుడ్డా మాట్లాడుతూ దుకాన్‌ మకాన్‌, దుల్హన్‌ పథకం, విదేశీ విద్య, షాదీఖానా నిర్మాణాం, హజ్‌యాత్రకు చేయూత, రంజాన్‌ తోఫా, మైనార్టీ కార్పొరేషన్‌ రుణాల పంపిణీ, ఇమామ్‌, మోజన్‌లకు వేతనాలు, ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలు, ఇలా అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీడీపీదేనని గుర్తుచేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయా పథకాలన్నింటినీ రద్దు చేసిందని మండిపడ్డారు. ఐదేళ్లలో ఎమ్మెల్యే శిల్పా చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమిచేయలేదని, అలాంటి వారికి ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వలస వచ్చిన శిల్పాకు ఇక్కడి ప్రజల కష్టాలు తెలియవని, తాను పక్కనే ఉన్న వేల్పనూరు బిడ్డనని ఏకష్టం వచ్చినా ఇక్కడి ప్రజలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు శివప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్‌, టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు కలీముల్లా, రాష్ట్ర కార్యదర్శి నాగూర్‌ఖాన్‌, నాయకులు ముత్తు, రేడియం నూర్‌, నబిరసూల్‌ తదితరులు ఉన్నారు.

వైసీపీ జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు యూనస్‌బాషా సోదరులు, ఏఆర్‌ గ్రానైట్స్‌ యజమాని రసూల్‌బాషాతో పాటు 40కుటుంబాలు, శ్రీపతిరావుపేట గ్రామ ఉపసర్పంచ్‌ మధుయాదవ్‌, గ్రామ వలంటీర్‌ స్వామితో పాటు పలువురు టీడీపీలో చేరారు. అదేవిధంగా ఇందిరేశ్వరం గ్రామానికి చెందిన పలు కుటుంబాలు, సిద్ధాపురం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు వైసీపీని వీడిలోకి చేరారు. ఆత్మకూరులోని వెంగళరెడ్డి కాలనీకి చెందిన వైసీపీ నాయకులు, మాజీ ఎంపీటీసీ మోమిన్‌ ముస్తఫా ఆధ్వర్యంలో భారీగా టీడీపీలోకి చేరారు.

Updated Date - Apr 18 , 2024 | 12:29 AM