మహిళ ఆత్మహత్య
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:26 AM
వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కింగ్ మార్కెట్‌కు చెందిన తెలుగు రేణుక అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈమె భర్త ఇటీవల మృతి చెందాడు.
కర్నూలు, జనవరి 28: వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కింగ్ మార్కెట్‌కు చెందిన తెలుగు రేణుక అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈమె భర్త ఇటీవల మృతి చెందాడు. మూడు రోజుల కింద తుంగభద్ర నదికి వెళ్లి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం శవమై కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని నదిలో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కొడుకు జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పవన్ కుమార్ తెలిపారు.