ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తా: ఎస్పీ
ABN , Publish Date - Aug 03 , 2024 | 12:10 AM
ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తానని, అలాగే మీ సమస్యల పరిష్కారానికి సంబంధించిన సమాచారం తెలియజేస్తామని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా శుక్రవారం ఒక ప్రకటనలో చెప్పారు.
నంద్యాల క్రైం, ఆగస్టు 2: ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తానని, అలాగే మీ సమస్యల పరిష్కారానికి సంబంధించిన సమాచారం తెలియజేస్తామని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా శుక్రవారం ఒక ప్రకటనలో చెప్పారు. జిల్లా ప్రజలు సెంట్రల్ కంప్లైంట్ సెల్ (సీసీసీ), ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు సంబంధించిన ఫిర్యాదుల సమాచారం తెలుసుకోవడానికి నేరుగా తనతో మాట్లాడాలనుకుంటే 9154987020కు కాల్ చేయవచ్చని తెలిపారు. సమస్యలపైనే కాకుండా శాంతిభద్రతలకు సంబంధించిన విషయాల్లోనూ ఫోన్ చేయవచ్చన్నారు. ఆన్‌లైన్ మోసాలకు సంబంధించి, జాబ్ ఇప్పిస్తామని మోసం చేసినా, బిట్‌కాయిన్స్‌కు సంబంధించి, లోన్ యాప్‌లలో మోసపోయినా, మరే ఇతర సైబర్ మోసాలకు గురైనవారైనా మొదట 1930 నెంబర్‌కు లేదా సైబర్ క్రైం ప్రభుత్వ వెబ్‌సైట్లో కాని, జిల్లా సైబర్ క్రైం ఆఫీస్‌ను గాని సంప్రదించాలని ఎస్పీ సూచించారు.