Share News

రాబోయేది కూటమి ప్రభుత్వమే

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:44 AM

రెండు నెలల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం వచ్చేది ఖాయమని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌ అన్నారు.

రాబోయేది కూటమి ప్రభుత్వమే

కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ

కర్నూలు(అర్బన్‌), ఏప్రిల్‌ 13: రెండు నెలల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం వచ్చేది ఖాయమని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌ అన్నారు. శనివారం నగరంలోని 16వ వార్డు బుధవారపేటలో తెలుగు యువత రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి లక్కీటూ గోపినాథ్‌ ఆధ్వర్యంలో వైసీపీ యువనాయకుడు విక్రమ్‌, అజయ్‌ బృందం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీజీ భరత్‌ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తేనే యువత భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు పామన్న, అబ్బాస్‌, రామాంజనేయులు, పోతురాజు రవికుమార్‌, ధరూర్‌ జేమ్స్‌, నరేన్‌, జనసేన కర్నూలు ఇన్‌చార్జి హర్షద్‌, రాయలసీమ ఎన్నికల కన్వీనర్‌ పవన్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు నరేష్‌ పాల్గొన్నారు.

మంచి చేసే వారిని ప్రొత్సహించండి: సమాజంలో మంచి పనులు చేసే వారిని పోత్సహించాలని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌ అన్నారు. శనివారం నగరంలోని కుమ్మరి వీదిలో ఉన్న షిరిడీ సాయి బాబా సమ్మెత శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం 16వ వార్షికోత్సం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి టీజీ భరత్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ భరత్‌ మాట్లా డుతూ దత్తాత్రేయ సాయి ఆలయంలో 16 సంవత్సరాలుగా అధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆలయ ప్రతని ధులు టీజీ భరత్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ ఆభ్యర్థి బస్తి పాటి నాగరాజు పాల్గొని టీజీ భరత్‌తో కలిసి భక్తులకు భోజనం వడ్డించారు. కార్యక్రమలో టీడీపీ నాయకులు ఊట్ల రమేష్‌, చెన్నారెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 12:44 AM