పార్టీ సభ్యత్వంతో సంక్షేమం
ABN , Publish Date - Oct 27 , 2024 | 01:10 AM
టీడీపీ సభ్యత్వంతో కార్యకర్తలకు సంక్షేమం అందుతుందని టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్ అన్నారు.
ఆలూరు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): టీడీపీ సభ్యత్వంతో కార్యకర్తలకు సంక్షేమం అందుతుందని టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్ అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ప్రతి టీడీపీ కార్యకర్త సభ్యత్వం తప్పక తీసుకోవాలని సూచించారు. న్నారు. రూ.వంద చెల్లించి సభ్యత్వం చేసుకుంటే, రూ.5లక్షల ప్రమాద భీమా వర్తిస్తుందన్నారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రామ్‌నాథ్ యాదవ్, వైస్ చైర్మన్ సాలి సాహెబ్, మండల కన్వీనర్‌లు పరామరెడ్డి, సుధాకర్, విజయభాస్కర్ గౌడ్, నర్సప్ప, సురేంద్ర, మండల నాయకులు రజని, డా. నెట్టప్ప, వెంకన్న, తిమ్మయ్య, గోవిందు, రాము యాదవ్, వీరన్నగౌడ్, కిష్టప్ప, మసాల జగన్, రామాంజినేయులు, మల్లికార్జున, కిట్టు, దద్దు పాల్గొన్నారు.