టీడీపీతోనే మైనార్టీల సంక్షేమం: అఖిలప్రియ
ABN , Publish Date - May 12 , 2024 | 12:35 AM
రాష్ట్రంలో టీడీపీతోనే మైనార్టీల సంక్షేమం సాధ్యమని టీడీపీ ఆళ్లగడ్డ అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు.

చాగలమర్రి, మే 11: రాష్ట్రంలో టీడీపీతోనే మైనార్టీల సంక్షేమం సాధ్యమని టీడీపీ ఆళ్లగడ్డ అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు. శనివారం సాయంత్రం చాగలమర్రి గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. స్థానిక కేరళ వైద్యశాల నుంచి పాత బస్టాండు, గాంధీబజార్, పెద్దమకానం మీదుగా రోడ్ షోను నిర్వహించారు. ఇరిగెల రాంపుల్లారెడ్డి, భూమా జగత్ విఖ్యాతరెడ్డితో కలిసి అఖిలప్రియ ప్రచారం చేశారు. ఆమె మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. నియోజకవర్గంలో ఐదేళ్లుగా అభి వృద్ధి నిలిచి పోయిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభు త్వం విఫలమైందని ఆరోపించారు. మైనార్టీల సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిందని అన్నారు. టీడీపీ హయాంలో దుల్హన్ పథకం, మసీదుల అభివృద్ధికి నిధులు కేటాయించిందని అన్నారు. రంజాన్ తోఫా, సంక్రాంతి, క్రిస్మస్ కానుకలను అందజేశారని గుర్తుచేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆళ్లగడ్డలో మూడు పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని, ఐదువేల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూటమిలో భాగంగా బీజేపీ, టీడీపీ కలిసి రావ డంతో వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో ముస్లింల అభ్యున్నతికి టీడీపీ అన్ని రకాలుగా కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్సర్‌బాషా, నరసింహారెడ్డి, నాగరాజు, నరసింహులు, మౌళాలి, అనీఫ్, మాబులాల్, అజీం, ఉసేన్ వలి, షరీఫ్, కరీముల్లా, గఫార్, జనసేన నాయకులు పాల్గొన్నారు.