రైతుల సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:59 PM
వైసీపీ ప్రభుత్వం రైతులను, రైతుకూలీలను నట్టేట ముంచిందని, చంద్రబాబునాయుడు రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారని, రైతులకు అన్నివిధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

జూపాడుబంగ్లా, జూన్ 17: వైసీపీ ప్రభుత్వం రైతులను, రైతుకూలీలను నట్టేట ముంచిందని, చంద్రబాబునాయుడు రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారని, రైతులకు అన్నివిధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. జూపాడుబగ్లాలోని సచివాలయం వద్ద సోమవారం రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమం సర్పంచ్ బాలయ్య, ఎంపీటీసీ వెంకటమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జయసూర్య పాల్గొని రాయితీ విత్తనాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారన్నారు. పింఛన్ల పెంపు, రైతుల టైటిలింగ్ యాక్టు రద్దు, అన్నక్యాంటీన్లు యువతకు స్కిల్‌పై ప్రాధాన్యత కల్పించారని అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రారంభించిన జైన్‌ఇరిగేషన్ పరిశ్రమ, మెగా సీడ్‌పార్కులను వైసీపీ ప్రభుత్వం నిలిపేసిందని, వాటిని కనీస సౌకర్యాలు అందించి అభివృద్ధి చేస్తే యువతకు, వ్యవసాయకూలీలకు ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా కేసీ కింద తూములు, కాలువలు అధ్వానంగా ఉన్నాయని, జూపాడుబంగ్లా ఎత్తిపోతల పఽథకాలు పనిచేయడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గ పరధిలో ఉన్న సాగు, తాగునీటి పథకాలను అభివృద్ధి చేయడానికి అధికారులతో సమీక్షా నిర్వహించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, గిరీశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లుయాదవ్, మోహన్ రెడ్డి, శ్రీనివాసులు, రమణారెడ్డి, మద్దూరు సుధాకర్, కృష్ణయ్య, జంగాల పెద్దన్న, రవికుమార్ యాదవ్, బాబు, హనుమంతరెడ్డి, నారాయణరెడ్డి, గోరేసాహెబ్, ఖాజీకురైషన్, మన్సూర్‌బాషా, ఏడీఏ విజయశేఖర్, ఏవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
నందికొట్కూరు: నందికొట్కూరు మార్కెట్ యార్డును ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ అధికారులు ఎమ్మెల్యేకు పూలమాల వేసి స్వాగతం పలికారు. మార్కెట్ యార్డులో నిరుపయోగంగా ఉన్న పైపులను, శిథిలావస్థలో ఉన్న భవనాన్ని, తదితర వాటిని ఆయన పరిశీలించారు. మార్కెట్ యార్డులో జరుగుతున్న కార్యకలాపాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, జమీల్, రసూల్ తదితరులు పాల్గొన్నారు.