Share News

తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:23 AM

కర్నూలు నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌ అన్నారు.

తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం

కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌

కర్నూలు(అర్బన్‌), ఏప్రిల్‌ 12: కర్నూలు నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌ అన్నారు. శుక్రవారం నగరంలోని మౌర్యా ఇన్‌లోని తన కార్యాలయానికి వచ్చిన కర్నూలు నగర దేవాలయాల భజన బృందాల సభ్యులతో టీజీ భరత్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీజీ భరత్‌ మాట్లాడుతూ ప్రజా సేవ చేసేందుకు తాము రాజకీయాల్లో ఉన్నామన్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రం లోని అన్ని రంగాలు ఎంతో నష్టపోయాయన్నారు. చంద్రబాబు ముఖ్య మంత్రి అయితే మళ్లీ రాష్ట్రం అభివృద్ధి ముందుకు వెళుతుందన్నారు. పరిశ్ర మలు తీసుకొచ్చి కర్నూలు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పి స్తానని చెప్పారు. కార్పొరేటర్‌ పరమేష్‌. ఆలయాల భజన బృందాల సభ్యు లు బసవరాజు, నాగార్జున, రామలింగయ్య, ఆడ్వకేట్‌ నాగా ర్జున, వెంకటే శ్వర్లు, గిడ్డయ్య, భాస్కర్‌, పెంచలయ్య, కస్తూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కర్నూలును అభివృద్ధి చేస్తా: కర్నూలు నగర అభివృద్ధికి కృషి చేస్తానని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌ అన్నారు. గురువారం సాయంత్రం నగరంలోని 15వ వార్డు బుధవారపేటలో టీజీ భరత్‌ భరోసా యాత్ర చేపట్టారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ రూ.4వేలు అంద జేస్తామన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 01:23 AM