రైతుల సమస్యలు పరిష్కరిస్తాం : కలెక్టర్
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:54 AM
రీసర్వేలు జరిగిన గ్రామాలలో భూ సమస్యలను పరిష్కరించేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ పి.రంజిత బా షా అన్నారు.

గోనెగండ్ల, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): రీసర్వేలు జరిగిన గ్రామాలలో భూ సమస్యలను పరిష్కరించేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ పి.రంజిత బా షా అన్నారు. గురువారం గోనెగండ్ల మండల పరిధిలోని కున్నూరు గ్రామంలో గ్రామసభకు కలెక్టర్ రంజిత బాషా, సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ హాజరయ్యారు. గ్రామస భలో ప్రజల నుంచి వినతులను వారు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం భూ సమస్యలు ఉన్న రైతులు కర్నూలు కలెక్టరేట్‌కు రాకుండా ఆయా గ్రామాలలోనే సమస్యలు పరిష్కరించే విధంగా ఆయా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహిస్తు న్నామన్నారు. కున్నూరు గ్రామ సర్పంచ గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీ లేవని వాటికి నిధులు విడుదల చేయాలని కోరగా అందుకు కలెక్టర్ స్పందించి నిధులు విడుదల చేస్తామన్నారు. అనంతరం గ్రామంలోని సచివా లయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడి రికార్డులను పరిశీలించారు. ఎవరు ఏయే విధులు నిర్వహిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అసి స్టెంట్ కలెక్టర్ చల్లాకళ్యాణి, సర్వే ఏడీ మునికన్నన, తహసీల్దార్ కుమారస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.
మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి:
విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యా హ్న భోజనాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం కున్నూరు గ్రా మంలోని ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. పాఠశాలలో ఇతర సమ స్యలను పరిష్కరించాలని సంబంధింత అధికారులను కోరారు.
గూడెంలోనే ఉల్లి పంటను అమ్ముతాం
- కలెక్టర్ ముందు ఉల్లి రైతుల గోడు
దూరమైన సరే మేము పండించిన ఉల్లి పంటను తాడేపల్లిగూడెంలోనే అమ్ముతాము కాని కర్నూలులో అమ్మము అని కన్నూరు గ్రామ ఉల్లి రైతులు కలెక్టర్ రంజిత బాషాతో అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ రంజితబాషా కున్నూరుకు వచ్చారు. అనంతరం గ్రామ శివార్లలో ఉల్లి పంటను ఆరబోసుకొని గ్రెడింగ్ చేస్తున్న ఉల్లి రైతుల దగ్గరకు వచ్చి వారి సమస్యలను అడిగారు. ఉల్లి పంట గిట్టుబాటు అవుతుందా.. లేదా.. ఎకరానికి ఎంత పెట్టబడి వస్తుంది. పండిన పంటను ఎక్కడి అమ్ముతారు అని ఉల్లి రైతులను కలెక్టర్ ప్రశ్నించారు. దీంతో ఉల్లి రైతులు ప్రస్తుతం గిట్టుబాటుధర ఉంది. కార్యక్రమంలో ఏడీఏ మహుమ్మద్ ఖాద్రీ, ఏవో హేమ లత, సిబ్బంది పాల్గొన్నారు.