Share News

పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:27 PM

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల

జూపాడుబంగ్లా/వెలుగోడు, జూలై 28: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం ఆరుగేట్ల నుంచి 10వేల క్యూసెక్కులు విడుదల చేయగా, ఆదివారం శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతం జురాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో సాయంత్రం 18వేల క్యూసెక్కులకు పెంచి నీటిని కాలువలకు విడుదల చేశారు. ఆ నీటిని బానకచర్ల నీటిసముదాయం నుంచి తెలుగుగంగకు 10వేల క్యూసెక్కులు, కేసీ ఎస్కేప్‌ 3వేల క్యూసెక్కులు, గాలేరునగరి కాల్వకు 5వేల క్యూసెక్కుల చొప్పున మళ్లించినట్లు అధికారులు తెలిపారు. వెలుగోడు జలాశయం పూర్తిసామర్థ్యం 16.95 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 1.359 టీఎంసీలకు నీరు చేరుకుందని తెలుగుగంగ ఏఈ శివానాయక్‌ తెలిపారు.

Updated Date - Jul 28 , 2024 | 11:27 PM