Share News

కంది పొలంలోకి చేరిన నీరు

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:17 AM

మండలంలోని ఎడవలి, బొమ్మనపల్లి గ్రామాల్లో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు కంది పంట నీట మునిగింది

కంది పొలంలోకి చేరిన నీరు

నీట మునిగిన కంది పంట

మద్దికెర, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎడవలి, బొమ్మనపల్లి గ్రామాల్లో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు కంది పంట నీట మునిగింది. రెండు రోజుల నుంచి ఎడతె రిపి లేని వర్షాలు పడటం వల్ల పొలాల్లో తేమ అధికంగా ఉంది. అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉల్లి పంట కూడా దెబ్బతినడంతో రైతులు పంటను కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. నల్లరేగడి పొలాల్లో సాగు చేసిన పప్పుశనగ పంట అధికవర్షాల వల్ల మొలకెత్తలేదని, కొన్ని పొలాల్లో అధిక తేమతో పప్పు శనగ కుల్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:17 AM