Share News

ఇక విజిబుల్‌ పోలీసింగ్‌ : ఎస్పీ

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:06 AM

ఇక విజిబుల్‌ పోలీసింగ్‌ : ఎస్పీ

ఇక విజిబుల్‌ పోలీసింగ్‌ : ఎస్పీ

నంద్యాల క్రైం, ఆగస్టు 20 : శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ముఖ్య కూడళ్లలో లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్‌, మోటార్‌ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ట్రిపుల్‌ రైడింగ్‌, నెంబర్‌ ప్లేట్‌, సరైన రికార్డులు, హెల్మెట్‌ లేని వారిని గుర్తించడం మొదలైన వాటికి జరిమానా విధిస్తామని అన్నారు. అలాంటి వారికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు గుర్తించిన బ్లాక్‌స్పాట్‌ల వద్ద స్పీడ్‌ బ్రేకర్లు సూచించేలా హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తామని అన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడంలాంటి వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

కళాశాలల్లో అవగాహన : జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ అధికారులు 22 బృందాలుగా ఏర్పడి 51 వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఫుడ్‌ సేఫ్టీపై వంట చేసే వారికి అవగాహన కల్పించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ, ఈవిటీజింగ్‌కు అడ్డుకట్ట, మహిళలపై జరిగే నేరాలపై కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Updated Date - Aug 21 , 2024 | 12:06 AM