మిరపకు తెగుళ్లు రైతుకు దిగులు
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:14 AM
మండలంలోని 11 గ్రామాల్లో 1700 ఎకరాల్లో మిరప సాగు చేశారు. ఇప్పటికే ఎకరాకు రూ.70 నుంచి 80వేల వరకు పెట్టుబడులు పెట్టారు. పంట చేతికొచ్చే సమయంలో తెగుళ్లు సోకడంతో రైతులు దిగులు చెందుతన్నారు.

దిగుబడి తగ్గిపోతుందని రైతు ఆవేదన
మార్కెట్‌లో ధర కూడా పతనం
మద్దికెర, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని 11 గ్రామాల్లో 1700 ఎకరాల్లో మిరప సాగు చేశారు. ఇప్పటికే ఎకరాకు రూ.70 నుంచి 80వేల వరకు పెట్టుబడులు పెట్టారు. పంట చేతికొచ్చే సమయంలో తెగుళ్లు సోకడంతో రైతులు దిగులు చెందుతన్నారు.
తెగుళ్ల దాడి..
మిర్చి పంటకు ఆకుముడుత, బొబ్బెర, నల్లి, జెమినీ వైరస్, కొమ్ముకుళ్లు తెగుళ్లు సోకాయి. ఒక్కసారిగా మూడు, నాలుగు రకాల తెగుళ్లు వ్యాపించడంతో చెట్టంతా ముడచుకుపోతోంది. బొబ్బ తెగులుతో పంట ఎండుబారుతుండగా.. ఆకుముడతతో ఆకులు ముడత పడుతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా తెగులు అదుపులోకి రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇలా మందులు పిచికారీ చేయడంతో అదనపు ఖర్చు అవుతుందని అంటున్నారు.
తగ్గనున్న దిగుబడి, ధర పతనం..
ఈ దఫా తేజా విత్తనం సాగు చేశామని, ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. మూడు, నాలుగు రకాల తెగుళ్లు వ్యాపించడంతో దిగుబడిచ గణనీయంగా తగ్గే ప్రమాదమందని ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు దిగుబడి తగ్గుతుంటే, మరోవైపు మార్కెట్‌లో కిలో రూ.15 నుంచి రూ.18లకు ధర పడిపోవడంతో పంట కోయలేక అలాగే వదిలేస్తున్నారు. వ్యవసాయ అధికారులు పంటను పరిశీలించి, సలహాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
తెగుళ్లతో కోలుకులోని దెబ్బ
రెండెకరాల్లో మిరప సాగు చేశా. రూ.2లక్షలు ఖర్చ యింది. బాగా పెరి గిందనుకోలోపే నల్లి, ఆకు ముడుత తెగుళ్లు ఆశించాయి. దీనికి తోడు తుఫాన్ ప్రభావంతో పంట దెబ్బతింది. ఎన్ని మందులు పిచికారీ చేసినా అదుపు లోకి రావడం లేదు. నారాయణస్వామి, బసినేపల్లి
సలహామేరకు పురుగు మందులు వాడాలి
మిరపకు ఆకుముడుత, జెమినీ వైరస్, పూత పురుగు, బొబ్బెర తెగుళ్లు సోకాయి. వీటి నివారణకు టిప్రోనిల్, ఇమ్డాక్‌క్లోబ్రిడ్ లీటరు నీటిలో 2 గ్రాములు లేదా టిప్రోనిల్ డయామాక్సైడ్ పంటపై పిచికారీ చేయాలి. కార్పసల్ఫైడ్ ఫైంథోమెట్ బ్లూఫెండామైండ్ గ్రేసియా మందులు వాడాలి. వీటితోపాటు 20 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్, బూస్టర్ డోస్‌గా వాడాలి. వివరాలకు కార్యాలయంలో సంప్రదించండి. - రవి ఏవో.