ఉత్సాహంగా వినాయక నిమజ్జనం
ABN , Publish Date - Sep 10 , 2024 | 12:59 AM
పట్టణంలో వాడవాడల్లో మూడు రోజుల పాటు పూజలు అందుకొన్న గణనాఽథుడిని భక్తులు సోమవారం సాయంత్రం నిమజ్జనం చేశారు.
కోడుమూరు, సెప్టెంబరు 9: పట్టణంలో వాడవాడల్లో మూడు రోజుల పాటు పూజలు అందుకొన్న గణనాఽథుడిని భక్తులు సోమవారం సాయంత్రం నిమజ్జనం చేశారు. ఎస్‌ఐ ఏపీ శ్రీనివాసులు ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచు భాగ్యరత్న, ఎంపీడీవో చంద్రశే ఖర్, ఇన్‌చార్జి తహసీల్దార్ రామాంజనేయులు, ఏఎస్‌ఐ సురేంద్ర నిమజ్జన పూజా పాల్గొన్నారు.
కోడుమూరు(రూరల్): మండలంలోని వెంకటగిరి, గోరంట్ల, లద్దగిరి, వర్కూరు, ముడుమలగుర్తి, క్రిష్ణాపురం, బైనదొడ్డి, పులకుర్తి గ్రామాల్లో వినాయక నిమజ్జనం జరిగింది. వర్కూరులో ఓ ముస్లిం కుటుంబం వినా యక చవితి వేడుకలను నిర్వహించి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. స్థానిక ఖాజాహుస్సేనస్వామి వంశీయులు దర్గా ప్రాంగణంలో వినాయక విగ్రహాన్ని కొలువుంచి మూడురోజులుగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిం చారు.
ఓర్వకల్లు: మండలంలోని ఓర్వకల్లు, కన్నమడకల, కేతవరం, పూడిచెర్ల, నన్నూరు, లొద్దిపల్లె, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, హుశేనాపురం, గుట్టపాడు, శకునాల, కాల్వ తదితర గ్రామాల్లో సోమవారం వినాయక నిమజ్జనం వైభ వంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా మండపాల్లో ఏర్పాటు చేసిన వినాయకులకు ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిం చారు. నిమజ్జనం సందర్బంగా వినాయకున్ని ట్రాక్టర్లపై ఏర్పాటు చేసి సాం స్కృతిక కార్యక్రమాలు, మేళతాళాలతో వీధుల గుండా ఊరేగించారు.
గూడూరు: గూడూరు పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రామాంజనేయులు, మాజీ జడ్పీటీసీ ఎల్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు రేమట సురేష్, మూలగేరి దస్తగిరి, టీడీపీ యువ నాయకుడు వెంకటేష్, మల్లేష్ నాయుడు, చరణ్ కుమార్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కల్లూరు: మండలంలో ఉలిందకొండ, లక్ష్మీపురం, కె.మార్కాపురం, చిన్నటే కూరు, పెద్దటేకూరు తడకనపల్లె, బస్తిపాడు, బొల్లవరం సల్కాపురం, పర్ల గ్రామాల్లో వినాయక నిమజ్జనం ఘనంగా జరిగాయి. మూడు రోజులు మం డపాల్లో నిత్య పూజలు అందుకున్న వినాయకుడు సోమవారం గంగమ్మతల్లి ఒడికి చేరాడు. వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామాల్లో స్వామి వారిని ఊరేగిస్తూ రంగులు జల్లుకుని, కోలాటాలు ఆడుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలతో యువత నృత్యం చేసుకుంటూ నిమజ్జనంలో పాల్గొన్నారు. ఉలిందకొండ, కె.మార్కాపురం గ్రామాల్లో కమిటీ సభ్యులు నిర్వహించిన వినాయక లడ్డూ వేలం పాటలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కె.రామాంజనేయులు, ఈవీ.రమణ, రంగస్వామిరెడ్డి, శ్రీకాంత, వెంకటరమణ, విజయ్, మోహన, నాగరాజు, చరణ్, మనోహర్, తేజనాయుడు, రామకృష్ణ పాల్గొన్నారు.