వైభవంగా ఊయల సేవ
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:19 AM
శ్రీశైలం మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవ వైభవంగా నిర్వహించారు.
శ్రీశైలం, ఆగస్టు 23: శ్రీశైలం మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవ వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ముందుగా మహాగణపతి పూజను చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఊయలలో ఆశీనులనుజేసి శాస్ర్తోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు. అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన పూజలు నిర్వహించి మంగళ హారతులు ఇచ్చారు. శ్రీశైల క్షేత్ర గ్రామదేవత అంకాలమ్మకు శుక్రవారం లోకకల్యానాన్ని ఆకాంక్షిస్తూ విశేష పూజలను దేవస్థానం నిర్వహించింది. అమ్మవారికి పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేష అలంకరణ, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన డి. సురేఖ బృందంతో భరతనాట్యం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.