Share News

ప్రమాదకర స్థాయిలో తుంగభద్ర ప్రవాహం

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:15 AM

ఆంధ్ర-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దున ప్రవహిస్తున్న తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం వద్ద తుంగభద్ర నది వరద నీటితో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది.

ప్రమాదకర స్థాయిలో తుంగభద్ర ప్రవాహం
మంత్రాలయం వద్ద పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర

మంత్రాలయం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దున ప్రవహిస్తున్న తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం వద్ద తుంగభద్ర నది వరద నీటితో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. గురువారం సాయంత్రం మంత్రాలయం వద్ద 311.500 మీటర్ల నీటి మట్టంతో 1.11లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించిం ది. టీబీ డ్యాం నుంచి 1.12లక్షల క్యూసెక్కు ల నీరు తుంగభద్ర నదికి విడుదల చేశారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనా ర్థం వచ్చి నదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు శ్రీమఠం అధికారులు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తహసీల్దారు రవి, సీడబ్ల్యూసీ అధికారులు, మంత్రాలయం సీఐ రామాంజులు, ఎస్‌ఐలు పరమేష్‌ నాయక్‌, విజయ్‌ కుమార్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:15 AM