Share News

శ్రీశైల రైలు మార్గానికి ప్రయత్నిస్తా: బైరెడ్డి

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:59 PM

శ్రీశైలానికి రోజురోజుకు భక్తుల రద్ధీ పెరుగుతోందని రైలు, విమానమార్గానికి ప్రయత్నిస్తానని, తన తనయురాలు ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి కేంద్రానికి లేఖ ఇవ్వనున్నట్లు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు, రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.

శ్రీశైల రైలు మార్గానికి ప్రయత్నిస్తా: బైరెడ్డి
శ్రీశైల ఆలయం ప్రాంగణంలో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

శ్రీశైలం, జూన్‌ 10: శ్రీశైలానికి రోజురోజుకు భక్తుల రద్ధీ పెరుగుతోందని రైలు, విమానమార్గానికి ప్రయత్నిస్తానని, తన తనయురాలు ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి కేంద్రానికి లేఖ ఇవ్వనున్నట్లు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు, రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. సోమవారం ఆయన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన తనయురాలు బైరెడ్డి శబరి కూటమి ఎంపీ అభ్యర్ధిగా ఘన విజయం సాధించినందుకు స్వామి, అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, అవినీతి పాలనతో రాష్ట్రం గాడి తప్పిందని అన్నారు. మద్యం, ఇసుక, భూముల కేటాయింపులలో భారీ అవినీతి అవకతవకలు జరిగాయన్నారు. వీటిపై విచారణ జరిపించాలని ఆయన వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయని, ఇప్పటికైనా జగన్‌ మోహన్‌రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందని హితువు పలికారు.

Updated Date - Jun 10 , 2024 | 11:59 PM