Share News

బాబు జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళి

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:05 AM

బాబు జగ్జీవన్‌రామ్‌ 117 జయం తిని పురస్కరించుకుని శుక్రవారం జడ్పీ మినీ సమావేశ భవనంలో ఆయన చిత్రపటానికి జడ్పీ సీఈవో నాసరరెడ్డి పూలమాలలు వేసి ఘ నంగా నివాళి అర్పించారు.

బాబు జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళి
బాబు జగ్జీవన్‌రామ్‌కు నివాళి అర్పిస్తున్న టీడీపీ నాయకులు

కర్నూలు(న్యూసిటీ), ఏప్రిల్‌ 5: బాబు జగ్జీవన్‌రామ్‌ 117 జయం తిని పురస్కరించుకుని శుక్రవారం జడ్పీ మినీ సమావేశ భవనంలో ఆయన చిత్రపటానికి జడ్పీ సీఈవో నాసరరెడ్డి పూలమాలలు వేసి ఘ నంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో పరిపాలన అధికారి సరస్వతి, మహ్మద్‌ హక్‌, ఉమాదేవి, సుమయ, జేమ్స్‌, కిషోర్‌, క్రిష్ణారావు, మనోహర్‌, రాములమ్మ పాల్గొన్నారు.

ఫ నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌ ఎ.భార్గవతేజ బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌, మేనేజర్‌ చిన్నరాముడు, మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ కే.విశ్వేశ్వరరెడ్డి, అకౌంట్స్‌ ఆఫీసర్‌ చుండీప్రసాద్‌ పాల్గొన్నారు.

ఫ బాబు జగ్జీవన్‌రామ్‌ జీవితం అందరికీ ఆదర్శమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌ అన్నారు. శుక్రవారం బుధవారపేట భవానమ్మ ఆలయం ఎదుట ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. కార్యక్రమంలో కార్యదర్శివర్గసభ్యుడు కే.రామక్రిష్ణ, కృష్ణ, రమేష్‌, చంద్ర, రామాంజనే యులు పాలొన్నారు.

ఫ బాబు జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తితో సామాజిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిద్దామని ఏపీ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌బాబు పిలుపునిచ్చారు. కేవీపీఎస్‌, డప్పుకళాకారులు, కాటి కాప రుల సంఘాల అధ్వర్యంలో ఆర్‌ఎస్‌ కూడలిలో బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎన్‌జి. కృష్ణ, విజయమ్మ, భాస్కర్‌, గురుస్వామి పాల్గొన్నారు.

కర్నూలు(అర్బన్‌): దేశ చరిత్ర పటంలో చెరగని ముద్ర వేసుకున్న మహనీయుల జీవిత చరిత్ర నేటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌ అన్నారు. శుక్రవారం ఐదు రోడ్ల కూడలిలోని జగ్జీవన్‌ రామ్‌ కాంస్య విగ్రహానికి ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజుతో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఫ పేదల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్‌ రామ్‌ అని డీసీసీ కే.బాబు రావు అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యా ల యంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. అంతకముందు ఐదు రోడ్ల కూడలిలోని జగ్జీవన్‌రామ్‌ కాంస్య విగ్ర హానికి నివాళి అర్పించారు. మాజీ మంత్రి మూలింటి మారెప్ప, దామో దరం రాధాకృష్ణ, ఉండవల్లి వెంకటన్న, బీ.బతుకన్న, బీ.ఆంజనేయులు, అనంతరత్నం, ప్రమీల, వెంకట సుజాత పాల్గొన్నారు.

ఆర్‌యూలో : రాయలసీమ యూనివర్సిటీలో జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి ఉపకులపతి బీ. సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డీన్‌లు వెంకటసుందరా నంద పుచ్చా, సీవీ కృష్ణారెడ్డి, ఆర్‌.భరత్‌ కుమార్‌, ప్రిన్సిపాల్‌ వై. హరి ప్రసా ద్‌రె డ్డి, పరీక్షల విభాగం కంట్రోలర్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కల్లూరు: నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యం లో డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. శుక్ర వారం కర్నూలు నగరంలో మాధవనగర్‌లోని గౌరు స్వగృహంలో బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి గౌరు వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ సంఘ సంస్కర్త, భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌ అందరికీ ఆదర్శనీయుడని కొని యాడారు. బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, పాల కొలను సుధాకర్‌రెడ్డి, పల్లె రఘనాథ్‌రెడ్డి, అయ్యపురెడ్డి, శ్రీరాములు, అయ్యస్వామి పాల్గొన్నారు.

కర్నూలు(కల్చరల్‌): బడుగు, బలహీన వర్గాలకు స్ఫూరి ్తప్రదాతగా బాబు జగ్జీవన్‌రామ్‌ నిలిచిపోయారని టీడీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు పి.హనుమంతరావు చౌదరి కొనియాడారు. శుక్రవారం రైల్వే స్టేషన్‌ రోడ్డు ఐదు రోడ్ల కూడలిలోని జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్య క్షుడు ధరూర్‌ జేమ్స్‌, కల్లూరు మండల మాజీ అధ్యక్షుడు బాలవెంకటేశ్వ రరెడ్డి, రెడ్డిపోగు బజారి, బీసన్న, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:05 AM