Share News

ఆరుగురు డీఎస్పీలు బదిలీ

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:48 PM

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆరుగురు డీఎస్పీలు బదిలీ

కర్నూలు, జూలై 31: ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 96 మంది డీఎస్పీ బదిలీలు జరిగాయి. ఈ నేపథ్యంలో కర్నూలు డీఎస్పీగా జే. బాబు ప్రసాద్‌ను నియమించింది. ఈయన ప్రస్తుతం కర్నూలు మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీగా ఉన్నారు. కర్నూలు డీఎస్పీగా ఉన్న విజయశేఖర్‌ను పోలీస్‌ హెడ్‌ క్వాటర్స్‌లో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించింది. అలాగే డోన్‌ డీఎస్పీగా శ్రీనివాసులును నియమించింది. ఈయన ప్రస్తుతం సీఐడీ విభాగంలో ఉన్నారు. డోన్‌ డీఎస్పీగా ఉన్న శ్రీనివాసరెడ్డిని పోలీస్‌ హెడ్‌ క్వాటర్స్‌లో రిపోర్టు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఏపీఎస్‌పీ సెకండ్‌ బెటాలియన్‌ డీఎస్పీగా ఉన్న భక్తవత్సలంను పొద్దుటూరు డీఎస్పీగా బదిలీ చేసింది. ఆళ్లగడ్డ డీఎస్పీగా షేక్‌ షర్ఫుద్దీన్‌ను ఏపీఎస్‌పీ సెకండ్‌ బెటాలియన్‌ డీఎస్పీగా నియమించింది. ఆత్మకూరు డీఎస్పీగా రామాంజినాయక్‌ను నియమించింది. ఈయన ప్రస్తుతం థర్డ్‌ బెటాలియన్‌లో డీఎస్పీగా ఉన్నారు. ఆత్మకూరు డీఎస్పీగా ఉన్న శ్రీనివాసరావును ప్రభుత్వం నెల్లూరు స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీగా నియమించింది. అలాగే తిరుమల లా అండ్‌ ఆర్డర్‌ డీఎస్పీగా ఉన్న శ్రీనివాసాచారిని కర్నూలు మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీగా నియమించింది. నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్‌ రెడ్డిని పోలీస్‌ హెడ్‌ క్వాటర్స్‌లో రిపోర్టు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే కడప పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటరులో డీఎస్పీగా ఉన్న రవికుమార్‌ను ఆళ్లగడ్డ డీఎస్పీగా నియమించింది.

Updated Date - Jul 31 , 2024 | 11:48 PM