Share News

చాగలమర్రిలో కుండపోత వర్షం

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:02 AM

చాగలమర్రిలో మంగళవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది.

చాగలమర్రిలో కుండపోత వర్షం

చాగలమర్రి, జూన్‌ 11: చాగలమర్రిలో మంగళవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల ప్రాంగణాలు జలమయమయ్యాయి. పాత బస్టాండు, గుంతపాలెం, నూరానీ మసీదు, పశువైద్యశాలకు వెళ్లే రహదారులు జలమయమయ్యా యి. మురికి కాలువలు పొంగి ప్రవహించడంతో రహదారులపై వర్షపు నీటితో కలిసి మురుగు నీరు ప్రవహించింది. దీంతో ఆయా వీధి ప్రజలు ఆ నీటిలోనే రాకపోకలు చేయాల్సి వచ్చింది. వర్షంతో పుడమి తల్లి పులకరించింది. వ్యవసాయ పనులు చేసేందుకు రైతులు సిద్ధపడుతున్నారు.

రుద్రవరం: మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. వర్షం నీటితో పల్లెల్లో ప్రధాన వీధులు జలమయమయ్యాయి. కొండమాయపల్లె, రుద్రవరం, వెలగలపల్లె గ్రామాల్లో వర్షం నీరు వీధుల వెంట ప్రవహించింది. వర్షం నీరు నిల్వ చేరడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. రెడ్డిపల్లె సమీపంలో మొక్కజొన్న పంటలో వర్షం నీరు నిల్వ చేరింది. రుద్రవరం సమీపంలో మినుము పంటలో వర్షం నీరు నిల్వ చేరింది.

Updated Date - Jun 12 , 2024 | 12:02 AM