Share News

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:32 PM

కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టమ్‌) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించామని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా ఆదివారం తెలిపారు.

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

కర్నూలు(కలెక్టరేట్‌), జూలై 28: కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టమ్‌) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించామని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా ఆదివారం తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్‌ కార్యాలయాలు, డివిజన్‌ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 11:32 PM