Share News

సీసీ కెమెరాల పని తీరును పర్యవేక్షించాలి

ABN , Publish Date - May 26 , 2024 | 11:41 PM

ఈవీఎంల స్ట్రాంగ్‌ రూంలను పర్యవేక్షించే సీసీ కెమెరాల పనితీరును అనుక్షణం పర్యవేక్షించాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు డాక్టర్‌ శ్రీనివాసులు కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బందిని ఆదేశించారు.

సీసీ కెమెరాల పని తీరును పర్యవేక్షించాలి
ఆర్జీఎంలో కళాశాలలో సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు

పాణ్యం, మే 26: ఈవీఎంల స్ట్రాంగ్‌ రూంలను పర్యవేక్షించే సీసీ కెమెరాల పనితీరును అనుక్షణం పర్యవేక్షించాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు డాక్టర్‌ శ్రీనివాసులు కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం ఆయన ఆర్జీఎంలోని కమాండ్‌ కంట్రోల్‌కు అనుసందానం చేసిన సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భద్రతా సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలన్నారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా సీసీ కెమెరాల ప్రసారాలలో ఏలాంటి లోపాలు తలెత్తినా సంబందిత సాంకేతిక సిబ్బంది వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు. తనిఖీల అనంతరం సందర్శకుల రిజిస్టరులో సంతకాలు చేశారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్‌ రూంల ప్రాంతాలలో ప్రవేశించకుండా గట్టి చర్యలు చేపట్టాలని భద్రతా సిబ్బందిని ఆదే శించారు. ఎన్నికల నిబంధనల మేరకు అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పాటిస్తూ కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్‌ 1 నుంచి 10 తేదీ వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. వచ్చే నెల 4వతేదీన జరగనున్న కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. అపోహలు, సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారాలు నమ్మకుండా రాజకీయ పార్టీలు, ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

Updated Date - May 26 , 2024 | 11:41 PM