వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యం
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:24 AM
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు.

మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు, జనవరి 11: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. గురువారం కల్లూరు అర్బన్ 32వ వార్డు ముజఫర్‌నగర్‌లో చేపట్టిన రచ్చబండ, బాబు ష్యూరి టీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల్లో భాగంగా ఆమె ఇంటింటికీ తిరిగి ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె టీడీపీ మేని ఫేస్టోను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు నమ్మకం కోల్పో యారని, జగన్‌ను గద్దెదింపేందుకు వారు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఉద్యోగులు, అంగన్‌వాడీలు, పారిశుధ్య కార్మికుల సమస్యలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లూ రు అర్బన్ 16 వార్డుల్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు తప్ప కొత్తగా చేసిందేమి లేదని ఆరోపించారు. టీడీపీ, జనసేన నాయ కులు, కార్యకర్తలు చంద్రబాబు గెలుపు కోసం కృషి చేయాలన్నారు. కార్య క్రమంలో వార్డు ఇన్‌చార్జి టైలర్ నాగరాజు, మాజీ కార్పొరేటర్ సోమన్న, ఖాజాబందె నవాజ్, జనసైన పార్టీ నాయకులు సుధాకర్, రాజు, కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాక ర్ యాదవ్, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, కల్లూరు మాజీ సింగిల్‌విండో చైర్మన్ ఎన్వీ.రామకృష్ణ, జె.గంగాధర్‌గౌడ్, కాసాని మహేష్‌గౌడ్, పీయూ మాదన్న, ఎస్.ఫిరోజ్, కేతూరు మధు పాల్గొన్నారు.