పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:40 AM
పోలీసు అమర వీరులు త్యాగాలు మరువలేనివని గోనెగండ్ల సీఐ గంగాధర్ అన్నారు.
గోనెగండ్ల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలీసు అమర వీరులు త్యాగాలు మరువలేనివని గోనెగండ్ల సీఐ గంగాధర్ అన్నారు. మండల కేంద్ర మైన గోనెగండ్లలో సోమవారం పోలీ సు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల్లో పోలీసులు, ఉన్నత పాఠశాల విద్యార్ధులతో ర్యాలీ చేపట్టారు. దేశం కోసం పోలీసుల చేసిన త్యాగాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.