Share News

మహిళల ఆర్థిక అభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:44 PM

మహిళా ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కృషి చేస్తుందని ఎన్‌ఆర్‌ఎల్‌ఎం జాతీయ నిర్వాహకులు నీరజ్‌ అన్నారు.

మహిళల ఆర్థిక అభివృద్ధే ధ్యేయం

పాణ్యం, జూన్‌ 11: మహిళా ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కృషి చేస్తుందని ఎన్‌ఆర్‌ఎల్‌ఎం జాతీయ నిర్వాహకులు నీరజ్‌ అన్నారు. మంగళవారం పాణ్యంలో దీన్‌ దయాల్‌ అంత్యోదయ యోజన ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ ద్వారా రుణాలు పొందిన 11 మంది మహిళల జీవనోపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మహిళలు చేస్తున్న ఉపాధి పనులను మరింత మెరుగుపరచడానికి ఎన్‌ఆర్‌ఎల్‌ఎం ద్వారా ఒక్కో మహిళకు రూ.40 వేలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం బాబురావు, ఎల్‌సీ రవికుమార్‌, సీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 11:44 PM