మహాశక్తి మేనిఫెస్టో మహిళలకు వరం: గౌరు చరిత
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:23 AM
టీడీపీ ప్రకటించిన మహాశక్తి మేనిఫెస్టో మహిళలకు వరం లాంటిదని పాణ్యం టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

ఓర్వకల్లు, మార్చి 5: టీడీపీ ప్రకటించిన మహాశక్తి మేనిఫెస్టో మహిళలకు వరం లాంటిదని పాణ్యం టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మంగళవారం ఓర్వకల్లులోని ఎస్సీ, బీసీ కాలనీలలో మహిళలకు బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ, మహాశక్తి పథకంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ మహిళలకు టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్నో ప్రయోజనాలు ఉం టాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, అత్యాచారాలు మితిమీరిపోతున్నా సీఎం జగన్ పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, పాణ్యం వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, నాయకులు విశ్వేశ్వరరెడ్డి, లక్ష్మీ కాంతరెడ్డి, బాల్‌రెడ్డి, రామకోటేశ్వరరావు, అన్వర్‌బాషా, నాగముని, శ్రీనివా సులు, రామాంజనేయులు, అబ్దుల్లా, వేణుగోపాల్ రెడ్డి, అల్లాబాబు, ఏసేపు, నాగరాజు, శ్రీరాములు, నాగమల్లేష్, సంజీవ, ఆదాంబాషా పాల్గొన్నారు.