రైతు కోసమే పొలం పిలుస్తోంది: ఎమ్మెల్యే
ABN , Publish Date - Sep 10 , 2024 | 12:59 AM
రైతుప్రయోజనాల కోసమే ప్రభుత్వం పొలంపిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిందని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
పత్తికొండ, సెప్టెంబరు 9: రైతుప్రయోజనాల కోసమే ప్రభుత్వం పొలంపిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిందని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. సోమవారం పొలంపిలుస్తుంది పోస్టర్లను విడుదల చేశారు. ఈనెల 24నుంచి ప్రతి మంగళ, బుధవారాల్లో వ్యవసాయాధికారులు గ్రామాల్లో పాల్గొంటారని అన్నారు. ఏడీఏ మోహన్ విజయ్‌కుమార్, పత్తికొండ, వెల్దుర్తి ఏవోలు వెంకటరాముడు, అక్భర్‌బాషా, హార్టికల్చర్ అధికారి దస్తగిరి ఇతర సిబ్బంది ఉన్నారు.