Share News

జిల్లాలో విద్యా ప్రమాణాలు భేష్‌

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:26 AM

కర్నూలు జిల్లాలో నాణ్యమైన విద్యా బోధనతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని, అంతర్జాతీయ స్థాయి జ్ఞానాన్ని అందుకోవడం సాధ్యమవుతుందని అమెరికా వాషింగ్టన్‌ ఇంటర్నేషనల్‌ ఐబీజీ ఎస్‌ బృందం ప్రతినిధి ఎరిల్‌బాలర్‌ అభిప్రాయపడ్డారు.

జిల్లాలో విద్యా ప్రమాణాలు భేష్‌

ఐబీజీఎస్‌ బృందం కితాబు

కర్నూలు(ఎడ్యుకేషన్‌), మార్చి 5: కర్నూలు జిల్లాలో నాణ్యమైన విద్యా బోధనతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని, అంతర్జాతీయ స్థాయి జ్ఞానాన్ని అందుకోవడం సాధ్యమవుతుందని అమెరికా వాషింగ్టన్‌ ఇంటర్నేషనల్‌ ఐబీజీ ఎస్‌ బృందం ప్రతినిధి ఎరిల్‌బాలర్‌ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఇంగ్లాండు, అమెరికాకు చెందిన ఐబీజీఎస్‌ అధ్యయన బృందం కోఆర్డినేటర్‌ వెండి గ్రీన్‌ ఎరిల్‌ బాలర్‌ జిల్లాలోని డైట్‌ కళాశాల, ప్రభుత్వ ఉర్దూ పాఠశాల, టౌన్‌ మోడ ల్‌ ఉన్నత పాఠశాలలను సభ్యులు పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయు లలో ఉన్న నైపుణ్యాలను, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. సదురు పాఠశా లల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులతో బృందం సభ్యులు ప్రత్యక్షంగా మాట్లా డారు. వినూత్నమైన బోధనతో విద్యార్థుల ప్రగతికి నూతన విద్యావిధానంలో కర్నూలు జిల్లాను ఎంపిక చేస్తున్నామన్నారు. ఇందులో మాతృభాష కూడా ఒక సబ్జెక్టుగా ఉంటుందని, మిగతావన్నీ ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారని తెలి పారు. ఈ విదేశీ అధ్యయన బృందం వెంట డీఈవో శామ్యూల్‌ ఉండి వారికి వివరించారు. కార్యక్రమంలో ఏడీ శ్యామూల్‌ పాల్‌, డైట్‌ ప్రిన్సిపాల్‌ వసుంధరా దేవి, అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 07:38 AM