Share News

మాజీ ప్రధాని మృతి తీరని లోటు

ABN , Publish Date - Dec 28 , 2024 | 01:01 AM

మాజీ ప్రధాని మన్మోహన సింగ్‌ మరణం దేశానికి తీరని లోటు అని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మిగనూరు ఇనచార్జీ కాశీం వలి అన్నారు.

మాజీ ప్రధాని మృతి తీరని లోటు
మన్మోహన సింగ్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఎమ్మిగనూరు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని మన్మోహన సింగ్‌ మరణం దేశానికి తీరని లోటు అని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మిగనూరు ఇనచార్జీ కాశీం వలి అన్నారు. శుక్రవారం స్థానిక సోమప్ప సర్కిల్‌లో మాజీ ప్రధాని మన్మోహన సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎనఎ్‌సయుఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్‌ యాదవ్‌, నాయకులు రఫీక్‌, అన్సర్‌, హర్ష, విష్ణు, దురంద్‌, అజయ్‌, సోమిరెడ్డి, అల్తా్‌ఫ పాల్గొన్నారు.

మంత్రాలయం: మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణ నేత మన్మోహన సింగ్‌ మృతి తీరని లోటు అని ఎమ్మెల్యే నాగిరెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. శుక్రవారం స్థానిక విద్యుత సబ్‌ స్టేషన ఆవరణలో మన్మోహన సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాల మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అమలు, ఆర్థిక సంస్కరణలు చేసిన గొప్ప వ్యక్తి మన్మోహన సింగ్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో గురెడ్డి భీమిరెడ్డి, బూదూరు మల్లికార్జున రెడ్డి, పురుషోత్తంరెడ్డి, గురురాజరావు, ప్రహ్లాద దేశాయ్‌, తెల్లబండ్ల భీమయ్య, రోగప్ప, మేకల నారాయణ, వైస్‌ ఎంపీపీ రాఘవేంద్ర, శ్రీనివాసులు, జనార్దన రెడ్డి, వెంకటేశ శెట్టి, వీరనాగుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 01:03 AM