Share News

చల్లా కోటలో బీటలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:31 AM

చల్లా కంచు కోటగా పేరున్న గ్రామాల్లో వైసీపీకి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి భారీ షాక్‌ ఇచ్చారు

చల్లా కోటలో బీటలు
బీసీ సమక్షంలో టీడీపీలో చేరిన కొండమనాయినిపల్లె వైసీపీ నాయకులు

కొండమనాయినిపల్లెలో మాజీ ఎమ్మెల్యే బీసీ పాగా

వైసీపీనీ వీడి టీడీపీలో చేరిన నాయకులు

బనగానపల్లె, ఏప్రిల్‌ 18: చల్లా కంచు కోటగా పేరున్న గ్రామాల్లో వైసీపీకి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి భారీ షాక్‌ ఇచ్చారు. అవుకు మండలంలోని కొండమనాయినిపల్లె గ్రామంలో మొదటి నుంచి చల్లా కుటుంబానికి పట్టు ఉండేది. ఆ గ్రామానికి చెందిన వైసీపీ కీలక నేతలు బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరి ఆ పార్టీకి ఝలక్‌ ఇచ్చారు. టీడీపీ సీనియర్‌ నాయకులు ఐవీ పక్కీరారెడ్డి ఆధ్వర్యంలో కొండమనాయినిపల్లె గ్రామానికి చెందిన ఏవీ నాగిరెడ్డి, వై. శివారెడ్డి, బాల పెద్దిరాజు, సంజన్న, బోయ సుంకన్న, సోమ్లా నాయక్‌, హనుమానాయక్‌, సుబ్బరాయుడు, నాయ క్‌, కుళాయి తదితర కీలక వైసీపీ నాయకులు, కార్యకర్తలు వారి కుటుం బాలతో సహ బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వారందరికీ బీసీ జనార్దన్‌రెడ్డి కండువాలు కప్పి టీడీపీలో ఆహ్వానించారు.

ఫ టీడీపీలో చేరిన చెరువుపల్లె వాసులు : చెరువుపల్లె గ్రామానికి చెందిన వైసీపీ కీలక నాయకులు మధుమోహన్‌, ప్రభాస్‌, రంగస్వామి, శంకరయ్య, మహేంద్ర, వెంకటేశ్వర్లు, మనోహర్‌, తిమ్మ య్య, మద్దిలేటిస్వామి, చుక్కా రమేష్‌, చెవుల విజయుడు తదితర మొత్తం 40 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. కోవెలకుంట్ల మండలం బిజనవేముల గ్రామ మాజీ సర్పంచ్‌ గడ్డం భక్త ప్రహ్లాదరెడ్డి వైసీపీకి(షాక్‌ ఇచ్చారు. గురువారం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు.

బీసీకి మద్దతుగా టీడీపీలో చేరిన కొలిమిగుండ్ల వాసులు: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్‌ రెడ్డికి మద్దతుగా కొలిమిగుండ్ల వాసులు పలువురు టీడీపీలో చేరారు. గురువారం బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో కొలిమిగుండ్లకు చెందిన రిటైర్డ్‌ వీఆర్‌ఓ రంగస్వామి, కదిరి నర్సిరెడ్డి, రంగస్వామి(యర్రన్న), రంగస్వామి అలియస్‌ నల్లన్న, సూర్యనారాయణరెడ్డి, సాంబయ్య, నరసింహుడు, శ్రీకాంత్‌రెడ్డి, రవి కుమార్‌, రాజేష్‌, రఘు, తలారి రంగస్వామి, కుమార్‌, మధు, మద్దిలేటి, గుర్రప్ప, చరణ్‌, పెద్దయ్య, ఓబన్న, ఓబులేసు, అంబన్న గారి ఓబన్న, తదితర 30 కుటుంబాలు టీడీపీలో చేరారు.

Updated Date - Apr 19 , 2024 | 12:31 AM