Share News

‘రైతులను దగా చేసిన వైసీపీ’

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:20 AM

రైతులను వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శిం చారు.

‘రైతులను దగా చేసిన వైసీపీ’
కోవెలకుంట్ల: లింగాలలో ప్రచారం చేస్తున్న బీసీ జనార్దన్‌రెడ్డి

కోవెలకుంట్ల, జనవరి 11: రైతులను వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. గురువారం కోవెలకుంట్ల మండలంలోని లింగాల గ్రామంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహంచారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో గురించి వివరించారు. బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ కుందూనదిపై జోలదరాసి రిజర్వాయర్‌ నిర్మాణం టీడీపీతోనే సాధ్యమని అన్నారు. కుందూనది రిజర్వాయర్‌ శంకుస్థాపన చేసిన 16 నెలల్లో పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీ నాయకులు ఒక ఇటుక కూడా పేర్చలేదని విమర్శించారు. లింగాల గ్రామంలో 2014నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో రూ.256 లక్షలతో అభివృద్ధి పనులు, రూ.62లక్షలు రుణమాఫీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్‌ పేరా శ్రీధర్‌రెడ్డి, అమడాల మద్దిలేటి, వల్లంపాడు సర్పంచ్‌ గార్లపాటి జగదీశ్వర్‌రెడ్డి,, లింగాల నాయుడు, బిజనవేముల హుసేని, చిన్నకొప్పెర్ల బుచ్చెన్న, గోవిందిన్నె బాలరాజు, రేవనూరు ఏవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

‘నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు హామీ’

బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు హామీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడు తూ పెద్దకొప్పెర్ల ఎత్తిపోతల పథకం, జోలదరాసి రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామని, బనగానపల్లె పట్టణంలో బైపాస్‌ రోడ్డు, కోవెలకుంట్లలో బైపాస్‌ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు. అలాగే వైసీపీ హాయంలో కుదేలైన నాపరాయి పరిశ్రమను ఆదుకుంటామని చంద్రబా బు హామీ ఇచ్చి ప్రకటన కూడా చేశారని గుర్తు చేశారు.

కొలిమిగుండ్లలో శుక్రవారం బాబు ష్యూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీసీ జనార్దన్‌రెడ్డి గురువారం తెలిపారు. కొలిమిగుండ్లలో నిర్వహించే ఈసదస్సుకు భారీగా హాజరు కావాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

బనగానపల్లె పట్టణంలో అర్హులైన పేదలందరికీ రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తామని బనగానపల్లె టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ అన్నారు. గురువారం బనగానపల్లె పట్టణంలోని కొండపేటలోని అమ్మవారిశాల వీధిలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో గురించి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. బీసీ ఇందిరమ్మ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో భరించ లేని స్థితిలో ఉండి ఇబ్బంది పడుతున్నారన్నారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని ఆమె పిలుపునిచ్చారు. వైపీపీ పాలన లో రాష్ట్రం అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శిరివెళ్లలో..

శిరివెళ్ల: అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయాలని టీడీపీ యువ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శిరివెళ్లలోని బెస్త కాలనీలో గురువారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు అందించబోయే సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరిగే అభివృద్ధి గురించి వివరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళి, మాజీ జడ్పీటీసీ యామా గుర్రప్ప, మాజీ ఎంపీటీసీ కొండబోయిన బాలచంద్రుడు, సూరా రామ, బీసీ ఖాజా హుసేన్‌, పీపీ లింగమయ్య, బీఎండీ రఫి, అబూబకర్‌ సిద్ధిఖ్‌, యామా శ్రీనివాసులు, తిరుమల రవి, బీసీ ఫిదా హుసేన్‌, ఉల్లి వెంకట సుబ్బయ్య, వేణుగోపాల్‌రెడ్డి, శివరామిరెడ్డి, రామనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:20 AM